Karthikeya: ” భజే వాయు వేగం ” మూవీ‌ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు.. స్పెషల్ అట్రాక్షన్ గా యంగ్ హీరో..!

Karthikeya: యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా మూవీ భజే వాయు వేగం. ఈ చిత్రం మే 31న రిలీజ్ కి రెడీ అయింది. ప్రశాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

the-pre-release-event-of-the-movie-bhaje-vayu-veela-has-been-finalized
the-pre-release-event-of-the-movie-bhaje-vayu-veela-has-been-finalized

దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. కాగా ఈ వేడుకకు చీప్ గెస్ట్ గా యంగ్ హీరో శర్వానంద్ హాజరవుతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

దస్పల్లా హోటల్స్ లో బుధవారం జరగనున్న ఈ ఈవెంట్ కు శర్వా గెస్ట్ గా రానున్నట్లు మూవీ యూనిట్ కాసేపటి క్రితమే 4వీట్ ద్వారా వెల్లడించింది. ఇక ఈ చిత్రంలో అందాల భామ ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రవిశంకర్, రాహుల్ హరిదాస్ తదితరులు ఈ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక ప్రజెంట్ మూవీ యూనిట్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు