Rashmika Mandanna : మళ్ళీ డీప్ ఫేక్ బారిన పడిన రష్మిక… ఈసారి ఏకంగా బికినీలో…

Rashmika Mandanna : డీప్ ఫేక్ అనేది ప్రస్తుతం సెలబ్రిటీలకు వణుకు పుట్టిస్తున్న పదం. అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ టెక్నాలజీ యుగంలో ఏఐ అనే సాంకేతికతను ఉపయోగించి ఎప్పుడు ఎవరి డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేస్తున్నారో అసలు తెలియట్లేదు. అంతేకాకుండా కనీసం ఆ వీడియోలను ఫేక్ అని గుర్తు పట్టడం కూడా కష్టమవుతోంది. అందుకే ఇటీవల కాలంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి టాప్ సెలబ్రిటీల ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. అవి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి వాటిపై ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్న కొంతమంది కేటుగాళ్లు మాత్రం హీరోయిన్ల ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడం మానట్లేదు. తాజాగా మరోసారి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ బాధితురాలుగా మారింది. ఈసారి ఆమెను ఏకంగా బికినీలో చూపించేశారు.

బికినీలో రష్మిక దీప్ ఫేక్ వీడియో…

తాజాగా పాపులర్ కొలంబియా మోడల్ డానియెలా విల్లారియల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లో షేర్ చేసిన వీడియోను ఎడిట్ చేసి అందులో ఆమె ఫేస్ బదులు రష్మిక ఫేస్ ను యాడ్ చేసి డీప్ ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్ గా మారింది. ఈ తాజా డీప్ ఫేక్ వీడియో పై రష్మిక స్పందించలేదు. కానీ ఇందులో ఆ ప్రముఖ మోడల్ బికినీలో కనిపించి హాట్ ట్రీట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ డీప్ ఫేక్ వీడియో వల్ల అదంతా రష్మిక చేసినట్టుగానే కనిపిస్తోంది. మరి ఈసారి రష్మిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

Viral: Rashmika Mandanna's Another Deepfake Video in Red-Bikini Sparks  Controversy, Here's the Truth About It

- Advertisement -

గతంలో రష్మిక రియాక్షన్…

2023 నవంబర్ లో రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఒక్కసారిగా దుమారం రేపింది. నిజానికి అప్పటికే ఎంతోమంది హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు రిలీజ్ అయ్యాయి. కానీ అన్నింట్లోకెల్లా రష్మిక వీడియో వైరల్ కావడం, దానిపై ఆమె స్పందించిన తీరు హాట్ టాపిక్ అయ్యాయి. అంతేకాకుండా ఇలాంటి అసభ్యకర పనులు చేసి ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ ఏకంగా బిగ్ బి అమితాబ్ రష్మికకు మద్దతు పలికారు. దీంతో సినిమా ఇండస్ట్రీలో నుంచి చాలామంది సెలబ్రిటీలు రష్మిక మందన్న డీప్ వీడియోకు వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు. దీంతో సోషల్ మీడియాలో డీప్ ఫేక్ పై సాగిన ఉద్యమాన్ని చూసి పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. రష్మిక మందన్న ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఈ వీడియోను క్రియేట్ చేసిన ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.

డీప్ ఫేక్ బారిన పడ్డ హీరోయిన్లు..

ఇక ఇప్పటిదాకా డీప్ ఫేక్ బారిన పడి బాధితులుగా మారింది కేవలం రష్మిక మందన్న మాత్రమే కాదు. గతంలో బాలీవుడ్ స్టార్స్ కాజోల్, అలియా భట్, రణవీర్ సింగ్, నోరా ఫతేహి, కత్రినా కైఫ్, అమీర్ ఖాన్ వంటి ప్రముఖులు ఈ డీప్ ఫేక్ బారిన పడ్డ స్టార్స్ లిస్ట్ లో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు