OTT Movie : రాత్రిళ్ళు మనుషుల్ని చంపే వింత జీవి… దాని వెంట పడే సైకో పిల్ల… చివరికి ఏమైందంటే?

OTT Movie : మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు అంటే ఈరోజుల్లో ఇష్టపడని మూవీ లవర్స్ ఉండరేమో. మరి మిస్టరీ తో పాటు హారర్ అంశాలు కూడా కలగలిస్తే ఇంకా ఆ ఎగ్జైట్ మెంట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు అంశాలను కలగలిపి థ్రిల్లింగ్ సినీమాటిక్ ఎక్స్పీరియన్స్ ను ఫేస్ చేయాలి అనుకునే వారి కోసం ఈరోజు ఇంట్రెస్టింగ్ మూవీ సజెషన్ ను తీసుకొచ్చాం. నిజానికి ఇదొక వెబ్ సిరీస్. సిరీస్ మొత్తంలో ఓ సైకో పిల్ల యాక్టింగ్ మెయిన్ హైలెట్ అని చెప్పొచ్చు. అసలు ఆ సిరీస్ ఏంటి? ఏ ఓటిటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

సాధారణంగా హర్రర్ మిస్టరీ అనగానే దయ్యాలు భూతాలు లాంటివి గుర్తొస్తాయి. కానీ ఈ రెండు అంశాలకు సైకో కూడా కలిస్తే గుర్తొచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణంగా ఈ జానర్ లో మనం ఇప్పటిదాకా చూసిన సినిమాలన్నింటి కంటే ఇప్పుడు మాట్లాడుకుంటున్న మూవీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సిరీస్ లో ఆ పిల్ల అసలే సైకో. అయితే రాత్రి పూట మనుషుల్ని చంపే వింత జీవి వెంట ఈ సైకో పిల్ల పడితే ఎలా ఉంటుంది అనే ఇంట్రెస్టింగ్ కథాంశంతో సరికెక్కింది ఈ వెబ్ సిరీస్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు వెడ్నెస్ డే. ఇది పాపులర్ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

A Review Of The Netflix Series “Wednesday”

- Advertisement -

సిరీస్ స్టోరీ ఏంటంటే…

ఓ చిన్న పిల్ల అచ్చం సైకోలా బిహేవ్ చేస్తూ ఉంటుంది. స్కూల్లో ఆ అమ్మాయితో అసలు ఎవ్వరూ స్నేహం చేయడానికి ధైర్యం చేయరు. అలాగని ఆ అమ్మాయి కూడా చొరవ తీసుకొని ఎవరితోనూ స్నేహంగా ఉండదు. ఆమె వింత ప్రవర్తన చూసి అందరూ భయపడుతూ ఉంటారు. ఇలా ఆమె తీరుతో ఏకంగా ఐదు సంవత్సరాలలో ఐదు స్కూల్స్ మారుతుంది. ఒకసారి అయితే ఏకంగా తన బ్రదర్ ని ఏడిపించిన వ్యక్తిని స్విమ్మింగ్ పూల్ లో ఫిరానా చేపలు వదిలి హడల కొట్టేస్తుంది. ఇక చివరకు తల్లిదండ్రులు ఆమెను స్కూల్స్ మార్పించి మార్పించి అలసిపోతారు.

మొత్తానికి ఆమె ప్రవర్తన గురించి వివరంగా తెలుసుకున్న తల్లిదండ్రులు ఆ సైకో పిల్లని ఒక అతీంద్రియ శక్తులు ఉన్న స్కూల్లో చేర్పిస్తారు. అయితే అక్కడ కూడా ఈ పిల్ల వింత వింతగా ప్రవర్తిస్తూ తనకు నచ్చింది చేసేస్తుంది. మరోవైపు ఆ స్కూల్లో ఎన్నో విచిత్రమైన రహస్యాలు దాగి ఉంటాయి. ఈ సైకో పిల్ల ఒక్కొక్కటిగా వాటిని చేదించే పనిలో పడుతుంది. అంతేకాకుండా ఆ స్కూల్లో రాత్రి పూట కనిపించిన మనుషుల్ని చంపేసే వింత జంతువు వెనుక పడుతుంది. మరి చివరికి ఈ సైకో పిల్ల కథ ఎలా ముగిసింది? ఆమె ఈ క్రమంలో ఎదుర్కొన్న ఇబ్బందులేంటి? ఆ స్కూల్లో ఉన్న సీక్రెట్స్ ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే వెడ్నెస్ డే సిరీస్ ను వీక్షించాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు