Vijay Antony: తమిళ్ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ తుఫాన్. ఈ మూవీ అతిత్వరలో రిలీజ్కు రెడీ అయింది. ఇక ఈ చిత్రాన్ని విజయ్ మిల్టన్ రూపొందించారు. ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ తో ఈ మూవీ ని రూపొందించారు చిత్ర యూనిట్.
ఇక ఈ చిత్రం టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండడంతో ప్రేక్షకులు ఇంప్రెస్ అవుతున్నారు. తుఫాను టీజర్ ను చూస్తుంటే ఈ మూవీ ఓ క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. కనిపించకుండా ఉంటూ తనకు కావాల్సిన వారిని కంటి రెప్పలాగా కాపాడుకునే పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించాడు.
భారీ యాక్షన్ సీన్స్, చేజింగ్ లతో ఈ సినిమాలో కావలసినంత యాక్షన్ స్టఫ్ ఉండబోతున్నట్లు టీజర్ లో క్లూ ఇచ్చారు. ఏకాటు హీరో, విలన్ల పాత్రలను కూడా అల్ట్రా స్టైలిష్ గా తీర్చిదిద్దినట్లు కనిపిస్తుంది. తుఫాన్ మూవీలో విజయ్ ఆంటోనితో పాటు సత్యరాజ్, శరత్ కుమార్, మేఘ ఆకాష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.