Producer : ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ‘గాడ్ ఫాదర్’ నిర్మాత కన్నుమూత..

Producer : సినిమా ఇండస్ట్రీ లలో గత కొంత కాలంగా వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నాళ్ల పాటు సౌత్ ఇండస్ట్రీలోనే ఈ వార్తలు ఎక్కువగా వినిపించాయి. ఇప్పుడు హాలీవుడ్ లో కూడా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నిన్న ప్రముఖ హాలీవుడ్ దిగ్గజ నిర్మాత
ఆల్బర్ట్ S. రడ్డీ కన్ను మూయడం జరిగింది. ఈ నిర్మాత పేరు పెద్దగా ఇండియన్ ఇండియన్ సినీ ప్రియులకు పెద్దగా పేరు తెలియకపోవచ్చు. కానీ ప్రపంచ దేశాల్లో ఎన్నో సినిమా ఇండస్ట్రీ లలో పలు సూపర్ హిట్ సినిమాలకు ప్రేరణ గా నిలిచిన ‘ది గాడ్‌ఫాదర్’ వంటి సినిమాను అందించింది నిర్మాత ఆల్బర్ట్. ఎస్. రడ్డి. అలాగే ‘మిలియన్ డాలర్ బేబీ’ వంటి దిగ్గజ చిత్రాల వెనుక ఉన్నది ఈయనే. ఆ సినిమాలకు ఆస్కార్ కూడా వరించడం తెలిసిందే. అంతటి గొప్ప చిత్రాలను అందించిన నిర్మాత (Producer) ఆల్బర్ట్. S. రడ్డి తన 94 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. ఇక హాలీవుడ్‌లో అతని విజయవంతమైన కెరీర్‌కు ప్రసిద్ధి చెందిన రడ్డీ వారసత్వంలో ‘హోగన్స్ హీరోస్’ వంటి ప్రశంసలు పొందిన ప్రాజెక్ట్‌లు కూడా ఉన్నాయి. మరియు ‘ది లాంగెస్ట్ యార్డ్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలని నిర్మించారాయన.

"The Godfather" movie producer Albert.S.Ruddy passed away.

లాస్ ఏంజిల్స్ లో కన్నుమూత..

ఇక నిర్మాత ఆల్బర్ట్ వైల్డ్ సీడ్ చిత్రంతోనే నిర్మాతగా మారినా, ఆయనకు గుర్తింపు తెచ్చింది మాత్రం “ది గాడ్ ఫాదర్” సినిమా. ఆ సినిమా నిర్మాత గా లాభాలు కురిపించడమే కాక, హాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చిపెట్టింది. అలాగే ఎన్నో అవార్డులు రివార్డులు తెచ్చిపెట్టింది. ఇక ‘ది గాడ్‌ఫాదర్’ కోసం మరియు ‘మిలియన్ డాలర్ బేబీ’లో క్లింట్ ఈస్ట్‌వుడ్‌ తో కలిసి పని చేయడం అతనికి చాలా పేరు తెచ్చి పెట్టాయి. ఇక ప్రముఖ నిర్మాత ఆల్బర్ట్ ఎస్. రడ్డీని కోల్పోయినందుకు హాలీవుడ్ పరిశ్రమ సంతాపం తెలిపింది. మరియు టెలివిజన్, సినీ ప్రపంచంలో చెరగని ముద్ర వేసిన గొప్ప వారసత్వాన్ని వదిలివేస్తుంది. ఇక నిర్మాత ఆల్బర్ట్ అమెరికాలో లాస్ ఏంజిల్స్‌లోని UCLA మెడికల్ సెంటర్‌లో స్వల్ప అనారోగ్యంతో రడ్డీ తన తుది శ్వాస విడిచాడు. ఈ విషయాన్నీ అతని కుటుంబం యొక్క ప్రతినిధి ద్వారా ధృవీకరించబడింది.

- Advertisement -

ఎన్నో సూపర్ హిట్ సినిమాలు..

ఇక ఆల్బర్ట్ రడ్డి అతని ప్రసిద్ధ కెరీర్ మొత్తంలో, అనేక దిగ్గజ ప్రాజెక్ట్‌ లతో సంబంధం కలిగి ఉన్నాడు. ‘హోగన్స్ హీరోస్’, ‘వాకర్, టెక్సాస్ రేంజర్’ వంటి సినిమాల్లో కీలక పాత్రలు కూడా పోషించాడు. ఇక నిర్మాత గా వెండితెరపై ఆయన కృషి నిజంగా హాలీవుడ్ లెజెండ్‌గా అతని స్థాయిని సుస్థిరం చేసింది. రడ్డీ యొక్క ఫిల్మోగ్రఫీలో ‘ది లాంగెస్ట్ యార్డ్’ అనే గొప్ప చిత్రాలు ఉన్నాయి. ఇక ఆల్బర్ట్ రడ్డీ పేరుకు పేరుగాంచిన ఇతర ప్రముఖ చిత్రాలలో ‘బ్యాడ్ గర్ల్స్,’ ‘ది స్కౌట్,’ మరియు ‘మటిల్డా,’.. ఇలా ప్రతి ఒక్కటి వివిధ శైలులలో నిర్మాతగా అతని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తాయి. ఇక మార్చి 27, 1973న ‘ది గాడ్‌ఫాదర్’ చిత్రానికి గాను ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డును స్వీకరించడానికి అతను ఆస్కార్ స్టేజ్‌ని అధిరోహించినప్పుడు తన కెరీర్ లో బెస్ట్ మూమెంట్ గా ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు