Simbu: తెలుగింటి అల్లుడు కాబోతున్న శింబు.. ఎప్పుడంటే..?

Simbu: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో శింబు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోని ఒక స్టార్ యాక్టర్ కూతుర్ని వివాహం చేసుకోబోతున్నారని త్వరలోనే తెలుగు ఇంటి అల్లుడు కాబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ముఖ్యంగా ఈయన సన్నిహితుల నుంచి ఈ వార్త తెరపైకి రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఎవరా స్టార్ యాక్టర్ అంటూ తెగ వెతికేస్తున్నారు..

బాల నటుడిగా సినీ ప్రయాణం..

Simbu: Simbu who is going to be Telugu's son-in-law.. when..?
Simbu: Simbu who is going to be Telugu’s son-in-law.. when..?

ఇకపోతే బాల నటుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శిలంబరసన్ అలియాస్ శింబు 2002లో కాదల్ విష్ణుతిల్లై అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు.. అప్పటినుండి ఎన్నో విజయవంతమైన సినిమాలలో నటించి.. కెరియర్ ను ఉన్నత స్థానానికి చేర్చుకున్న ఈయన కెరియర్ మొదటి నుండి అనేక వివాదాలు కూడా ఎదుర్కొన్నారు.. అలాగే మరెన్నో నెగటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి..అయితే ఏదేమైనా సరే తమిళ సినిమా అగ్ర కథానాయకులలో ఒకటిగా చక్రం తిప్పుతున్నారు.. ముఖ్యంగా ఇటీవల ఈయన చేసిన కొన్ని సినిమాలకు మంచి స్పందన కూడా లభించింది..

40 యేళ్లు అయినా పెళ్లికి దూరం..

సినిమాల పరంగా ముందుకు వెళుతున్న ఈయన వయసు 40 యేళ్లు.. ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నారు.. అయితే ఈయనను సింగిల్ అని అనడం కంటే మింగిల్ అని చెప్పడం చాలా బెటర్.. ఎందుకంటే తన కెరియర్ లో ఎంతోమంది హీరోయిన్స్ తో ఎఫైర్ నడిపిన ఈయన.. ఆ తర్వాత వారి నుంచి విడిపోయారు.

- Advertisement -

శింబు ఎఫైర్ జాబితా..

ముఖ్యంగా ఈయన ఎఫైర్ జాబితాలో ఉన్న హీరోయిన్స్ విషయానికి వస్తే.. నయనతార, హన్సిక, నిధి అగర్వాల్, వరలక్ష్మి శరత్ కుమార్ ఇలా ఎంతోమంది ఉన్నారనే చెప్పాలి.. అంతేకాదు శ్రీలంకకు చెందిన అమ్మాయితో వివాహానికి సిద్ధమవుతున్నాడనే వార్తలు కూడా వినిపించాయి.. ఇలా రోజు రోజుకి వార్తలు వైరల్ అవుతూ ఉండడంతో శింబు తండ్రి డి.రాజేందర్ విసిగిపోయాడని.. అందుకే ఎలాగైనా సరే ఈయనకు పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం..

తెలుగింటి అల్లుడు కాబోతున్న శింబు..

ఇక అందులో భాగంగానే తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఒక స్టార్ యాక్టర్ కూతురితో శింబు వివాహాన్ని జరిపించబోతున్నారని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం కూడా వెలువడుతుందని చెబుతున్నారు.. మరి ఈ మేరకు తమిళ మీడియాలో వ్యాపించిన ఈ వార్తలు సినీ అభిమానులలో చర్చనీయాంశంగా మారాయి.. మరి ఇది నిజమవుతుందా? లేక ఇది కూడా రూమర్ గానే మిగిలిపోతుందా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతూ ఉండడం గమనార్హం. ఏదిఏమైనా శింబు గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇక ఈసారైనా ఈయన పెళ్లి చేసుకుంటారా లేక ఇది కూడా ఇలా రూమర్స్ గానే మిగిలిపోతాయా అన్నది అభిమానులలో సందేహాలు కలిగిస్తోంది.

శింబు సినిమాలు..

ఇక ప్రస్తుతం ఈయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. దేశింగు పెరియసామి దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేస్తున్నారు.. ఈ చిత్రాన్ని కమలహాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది.. ఒకపక్క ఈ సినిమా పనులు శరవేగంగా జరుగుతూ ఉండగా.. సినీ రంగంలో తనకంటూ ఒక స్థానాన్ని సొంతం చేసుకున్నారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు