Bigg Boss 8 Telugu Contestants List.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్.. ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. అటు ఓటిటి సీజన్ ని కూడా పూర్తి చేసుకుంది.. ఇక త్వరలోనే సీజన్ 8 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.. ఎప్పటిలాగే జూలై మొదటి వారం కాకుండా సెప్టెంబర్ చివరి వారంలో ఈసారి ఈ షోని ప్రారంభించేలాగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు.. అందులో భాగంగానే కంటెస్టెంట్స్ గా పాల్గొనే వారి కోసం పక్కా ప్లానింగ్ చేస్తున్నారనే చెప్పాలి.. నిజానికి గత సీజన్లలో ముక్కు మొహం తెలియని వారిని హౌస్ లోకి తీసుకువచ్చి.. వారితో గేమ్ ఆడించారు .. ఇక వారెవరో కూడా ప్రేక్షకులకు తెలియకపోవడంతో కొన్ని సీజన్ లు భారీ డిజాస్టర్ ను మూటగట్టుకున్నాయి.. ముఖ్యంగా సీజన్ 6 ఏ రేంజ్ లో ఘోర పరాభవాన్ని చూసిందో అందరికీ తెలిసిందే.. అందుకే ఈసారి అలా జరగకుండా సెలబ్రిటీలను మాత్రమే తీసుకొస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయిఅందులో భాగంగానే సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న వారిని, రాజకీయపరంగా ఇమేజ్ దక్కించుకున్న వారితో పాటు హీరో , హీరోయిన్స్ కూడా ఈసారి హౌస్ లోకి తీసుకురాబోతున్నారట.. అలాగే జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు బుల్లితెర యాంకర్స్ కూడా ఇందులో పాల్గొనబోతున్నారని సమాచారం.. మరి ఎవరెవరు ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారో అందుకు సంబంధించిన ఒక తాజా వార్త వైరల్ గా మారుతోంది.మరి వారెవరో ఇప్పుడు చూద్దాం.
బిగ్ బాస్ సీజన్ 7.. ఈ షో ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. మంచి టిఆర్పి రేటింగ్ తో అత్యధిక వ్యూస్ ను సొంతం చేసుకుంది.. ఇందులో కామన్ మ్యాన్ క్యాటగిరిలో రైతుబిడ్డగా అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలవగా ప్రముఖ సీరియల్ నటుడు యంగ్ హీరో అమర్దీప్ రన్నర్ గా నిలిచారు.. ఇక ఈ గేమ్ షోలో ఉల్టా ఫుల్టా అంటూ రకరకాల ఆటలతో ప్రేక్షకులను తికమక పెట్టేసి అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారో ఊహించకుండా చేసి భారీ ట్విస్టులు ఇస్తూ షో ని మరింత విజయవంతం చేశారు.. అందుకే ఈసారి కూడా సీజన్ 8 ని ఇంతకంటే ఎక్కువ సక్సెస్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగానే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా చాలా జాగ్రత్తగా పగడ్బందీగా జరుగుతున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా ప్రముఖ బిగ్ బాస్ రివ్యూయర్ , సీజన్ 6 కంటెస్టెంట్ ఆదిరెడ్డి తాజాగా ఒక లిస్టు విడుదల చేశారు.. మరి వారిలో ఎవరెవరు ఉన్నారో ఎప్పుడు చూద్దాం.. తాజాగా ఆదిరెడ్డి షేర్ చేసిన లిస్టులో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తోపాటు హీరోయిన్స్ కుషిత కల్లపు, సోనియా సింగ్ పాల్గొనబోతున్నారట.. అలాగే సీనియర్ నటి హేమ, మరో సీనియర్ నటి సురేఖ వాణి లేదా ఆమె కూతురు సుప్రీత ఇందులో పాల్గొనే అవకాశం కల్పిస్తోంది. బర్రెలక్క.. సోషల్ మీడియాలో వారి పాపులారిటీ సంపాదించుకున్న ఈమె.. ఎమ్మెల్యే, ఎంపీగా కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే.. ఇక ఈమె కూడా హౌస్ లోకి రాబోతున్నట్లు సమాచారం. “మీది మొత్తం 1000 అయ్యింది.. రెండు లివర్ లు ఎక్స్ట్రా” అనే డైలాగుతో భారీ క్రేజ్ దక్కించుకున్న కుమారి ఆంటీ తో పాటు ఫార్మింగ్ నేత్ర , ఆమె మాజీ పెడతా వంశీ , జబర్దస్త్ స్టార్స్ బుల్లెట్ భాస్కర్ , చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీలతో పాటు యాంకర్ రీతూ చౌదరి కూడా అడుగుపెట్టనున్నారు..
అలాగే మాస్టర్ చెఫ్ సంజయ్ , అంజలి పావని , అమృత ప్రణయ్, యాంకర్ శివ , యాంకర్ స్రవంతి తో పాటు సీజన్ 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టి ఒక్క వారంలోనే ఎలిమినేట్ అయిన నయని పావని కూడా ఈసారి సీజన్ 8 లోకి కంటెస్టెంట్ గా రాబోతున్నట్లు సమాచారం. మరి ఈ లిస్టులో ఎవరు హౌస్ లోకి అడుగు పెడతారో చూడాలి. ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే బిగ్ బాస్ నిర్వహకులు దీనిపై స్పందించక తప్పదు.