Rashmika Mandana: నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన మనందరికీ సుపరిచితమే. తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది ఈ బ్యూటీ. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర పోషించి ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ అందుకుంది రష్మిక.
ఇక ప్రజెంట్ రష్మిక మందన పుష్ప కి సీక్వెల్ గా రూపొందుతున్న పుష్ప 2 లో సైతం హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైంది రష్మిక. ఇక ఇందుకు సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
ఇక తాజాగా రష్మిక మందన ఆనంద్ దేవరకొండ ని తన తమ్ముడిగా ట్రీట్ చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చూసిన పలువురు.. ఆనంద్ దేవరకొండ తమ్ముడు అయితే విజయ్ దేవరకొండ అన్నయ్య అవుతాడు… ఈ లెక్కన మీరిద్దరూ అన్న చెల్లిల్లా? ఇంతకాలం మీ ఇద్దరిపై ఏవేవో ఊహించుకుని పొరపాటు పడ్డామే?.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.