Pradeep Machiraju.. బుల్లితెర ఇండస్ట్రీలో ఫీమేల్ యాంకర్స్ లో సుమా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కూడా అంత పాపులారిటీ సొంతం చేసుకున్నారు.. ఎన్నో షోలకు యాంకర్ గా చేసి ప్రేక్షకులను మెప్పించిన ఈయన గత కొంతకాలంగా టీవీలలో కనిపించడం లేదని చెప్పాలి.. తన మాటలతో ఎలాంటి షో అయినా సరే సక్సెస్ఫుల్ చేయగలిగే సత్తా వుంది..చలాకీగా మాట్లాడుతూ .. పంచులు వేస్తూ.. నవ్వులు పూయించే ప్రదీప్ షో అంటే ఎవరైనా సరే ఆసక్తి చూపిస్తారు.. అంతలా ప్రేక్షకులకు దగ్గరైన ఈయన కొంతకాలం గ్యాప్ తీసుకున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
సక్సెస్ కోసం ఎన్నో కష్టాలు..
![Pradeep Machiraju: Whammo Pradeep Ilantoda.. Jabardast comedian who exposed the truth..!](https://www.telugu.filmify.in/wp-content/uploads/2024/05/Untitled-2024-05-30T171647.118.jpeg)
ప్రదీప్ కెరియర్ లో సక్సెస్ అవ్వడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు.. అలాగే ఒక డాన్స్ షోలో కూడా చేశారు.. కానీ అనుకున్నంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు.. అయితే ఇప్పుడు ప్రదీప్ అంటే తెలియని వారు ఉండరు.. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే ప్రోగ్రాం తో విపరీతమైన క్రేజ్ దక్కించుకున్న ప్రదీప్.. గడసరి అత్త సొగసరి కోడలు షో తో లేడీ ఫ్యాన్స్ ను కూడా పెంచుకున్నారు.. ఇప్పుడు హీరోగా కూడా చేసి ప్రేక్షకులను మెప్పించారు.. అలాగే జులాయ్ , అత్తారింటికి దారేది సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో కూడా మెరిశారు.. అయితే తాజాగా ప్రదీప్ గురించి ఎవరికీ తెలియని ఒక నిజాన్ని బయటపెట్టారు గెటప్ శ్రీను..
గొప్ప మనసు చాటుకున్న ప్రదీప్..
రాజు యాదవ్ సినిమాతో హీరోగా మారిన గెటప్ శ్రీను ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను , ప్రదీప్ మంచి స్నేహితులం.. నేను, సుధీర్ , ప్రదీప్ ముందుగా ఒక లోకల్ టీవీలో చేసేవాళ్లం.. అప్పుడు ఎంతో కష్టపడ్డాడు.. చాలా మంచివాడు.. తను వేసుకునే కాస్ట్యూమ్స్ ను అమ్మి అనాధ పిల్లలకు ఆ డబ్బులు ఇచ్చేవాడు.. వాటిలో ఒక్క రూపాయి కూడా తాను తీసుకునేవాడు కాదు.. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు.. ఒక్క మాకు తప్ప.. అంటూ ప్రదీప్ మంచి మనసును చెప్పుకొచ్చారు గెటప్ శ్రీను.. ఇక ప్రదీప్ గురించి ఈ విషయం తెలిసి వామ్మో ఇంత గొప్ప మనసుందా అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
హీరోగా ప్రదీప్ ప్రయాణం..
30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసారు.. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించి తనదైన శైలిలో హీరోగా ముద్ర వేసుకున్నారు ..అయితే ఈ సినిమా పెద్దగా కలెక్షన్లను రాబట్టకపోయినా ఇందులో ప్రదీప్ నటనకు మంచి మార్కులే పడ్డాయి..ఇక ఈ సినిమా ఫలితం తర్వాత సినిమాలలో నటిస్తాడు అనుకుంటే అటు సినిమాలలో నటించక.. ఇటు బుల్లితెర టీవీ షోలో కనిపించక.. అటు పెళ్లి చేసుకోక.. ఎటు వెళ్లినట్టు అంటూ అభిమానులు సైతం తెగ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. మరి ప్రదీప్ అజ్ఞాతవాసంలోకి వెళ్లిపోయాడని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా ప్రదీప్ మళ్లీ ఎప్పటిలాగే తన అద్భుతమైన టాలెంట్ తో ప్రేక్షకులను అలరించాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువే .. మరి త్వరలోనే ఎటువంటి ప్రోగ్రాం లేదా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.