Maharaja trailer: మహారాజా మూవీ ట్రైలర్ రిలీజ్.. విజయ్ సేతుపతి మరోసారి తన మాస్ హవా చూపించాడు గా..!

Maharaja trailer: నటుడు విజయ్ సేతుపతి 50వ చిత్రం గా నటిస్తున్న మూవీ మహారాజా. ఈ మూవీకి దర్శకుడు నిథిలన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసింది మూవీ యూనిట్.

ఆ పోస్టర్లో విజయ్ రక్తంతో తడిసిన చొక్కా ధరించి కనిపించడంతో ఈ మూవీ పై హైట్స్ పెరిగాయి. ఇక నేడు అనగా మే 30వ తారీఖున ఈ మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ మూవీ ట్రైలర్ను విడుదల చేశారు మూవీ యూనిట్. ఈ ట్రైలర్ తో తన మాస్ హవా మరోసారి నిరూపించుకున్నాడు విజయ్ సేతుపతి.. ” నా పేరు మహారాజా సార్.

కేకే నగర్లో సలాం షాప్ పెట్టుకున్నాం. ఇంట్లో ఉన్న లక్ష్మీని దొంగలించారు. ఎఫ్ యార్ ఫైల్ చేద్దామని వచ్చాను.. ” అనే డైలాగ్ తో ఈ మూవీ ట్రైలర్ మొదలైంది. ఈ ట్రైలర్లో విజయ్ సేతుపతి ఒక హెయిర్ స్టైల్ చేసే వ్యక్తిలాగా కనిపించారు. లక్ష్మి అనే ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి రానున్నడు విజయ్ సేతుపతి. దయచేసి నా లక్ష్మి ని వెతికి పెట్టండి సార్ అంటూ పోలీసులను బ్రతిమాలుకుంటూ ఉంటాడు. యాక్షన్ సన్నివేశాలతో కూడిన ఈ ట్రైలర్ ప్రెసెంట్ సోషల్ మీడియాని షేర్ చేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు