Vizag Nakshatra.. ఈమధ్య సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బయట సమాజంలో కూడా ఎక్కువగా వివాహేతర సంబంధాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.. దీనివల్ల చాలామంది కాపురాలు సైతం బజారున పడుతున్నాయి.. వివాహం చేసుకున్న తర్వాత కుటుంబాన్ని బాగా చూసుకోవాల్సింది పోయి కేవలం సుఖాల కోసం చాలా దారుణాలకు పాల్పడుతున్నారు.. మరి కొంతమంది వివాహం కాకముందే ఎఫైర్లు కొనసాగించి.. చివరికి మంచి డబ్బున్న వ్యక్తిని వివాహం చేసుకొని సెటిల్ అవుతున్నారు. వివాహమైనప్పుడు చాలామంది సీక్రెట్ గా సంబంధాలను కొనసాగిస్తూ బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగింది ..వాటి గురించి చూద్దాం. విశాఖపట్నంలో వివాహేతర సంబంధానికి చెందిన ఒక ఘటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. స్థానికంగా ఉండేటువంటి తేజ మిస్ వైజాగ్ నక్షత్ర లు ఇద్దరూ కూడా ప్రేమించుకొని మరీ వివాహం చేసుకున్నారట. వీరి వివాహం 2017 లో చాలా గ్రాండ్ గా జరిగింది. కొంతకాలం వీరి కాపురం కూడా చాలా సజావుగానే సాగింది.. వీరికి ఒక పాప కూడా జన్మించింది. ఆ తర్వాత నెమ్మదిగా తేజ పబ్జి గేమ్ కి బానిసగా మారిపోయి.. తాగడం మొదలుపెట్టి..అమ్మాయిలతో తిరగడం వంటివి చేస్తూ ఉండేవారట.
అలా కొన్ని నెలలకు భార్య భర్తల మధ్య విభేదాలు రావడంతో ప్రతిరోజు గొడవలు కూడా జరుగుతూ ఉండేవట. ఈ సమయంలో వీరిద్దరూ కొద్ది రోజులపాటు సపరేట్ గానే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే తేజ పనిచేసేటువంటి ఆఫీసులో మరో అమ్మాయితో తిరుగుతున్నాడు అనే విషయం తేజ భార్య నక్షత్ర తెలుసుకొని అక్కడికి చేరుకుంది. వెంటనే తన భర్తను కూడా నిలదీసిందట. ఈ క్రమంలోనే తేజ తన భార్య నక్షత్రం మీద చేయి చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా తన భార్యను అక్కడి నుంచి గెంటేయడం కూడా జరిగిందట.
దీంతో వెంటనే అక్కడ ఉండేటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో.. తేజ గురించి నిజాలు కూడా నక్షత్ర తెలియజేసింది.. తన భర్తకు పబ్జి అలవాటు ఉందని.. దీంతో అమ్మాయిలను ట్రాప్ చేస్తాడని .. తనకు రోజుకొక వర్జిన్ అమ్మాయి కావాలని.. అంతే కాకుండా అలాంటి వారిని తెచ్చి పెట్టమని తనని వేధిస్తూ ఉంటాడని కన్నీళ్లు పెట్టుకుంది.. అంతేకాకుండా నావల్ డాక్ యార్డులో పనిచేస్తూ ఉన్నారని.. అక్కడ కూడా కొన్ని తప్పులు చేయడం వల్ల వారు సస్పెండ్ చేశారని కూడా తెలియజేసింది నక్షత్ర. అయితే తనకు విడాకులు ఇవ్వకుండా మరొక యువతీతో ఇలా ఉండడం ఏంటా అంటూ తను ప్రశ్నించానని తెలిపింది.
కానీ మరొకవైపు నక్షత్ర భర్త మాత్రం మరొక లాగా తెలియజేస్తున్నారు.. కేవలం తనమీద లేనిపోని అబద్దాలు చెప్తోంది అంటూ తెలియజేస్తున్నారు. అయితే ప్రస్తుతం తన సినిమా ఆఫీసును అడుగుతున్నానని…ఆ అమ్మాయి ఆడిషన్ కి వచ్చిందని తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మరి ఈ కేసు విచారణకు ఎప్పుడు వస్తుందో చూడాలి.