SSMB29 : మహేష్ రాజమౌళి సినిమాపై క్లారిటీ ఇచ్చిన కట్టప్ప!

SSMB29 : కోలీవుడ్ ప్రముఖ స్టార్ నటుడు సత్యరాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తమిళనాట స్టార్ హీరోగా రాణించిన ఈయన ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యారు. ఇక తెలుగులో బాహుబలి లో “కట్టప్ప” పాత్ర సత్యరాజ్ కి ఎంత గుర్తింపు తెచ్చిపెట్టిందో తెలిసిందే. ఒక్క సౌత్ లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా సత్యరాజ్ కి క్రేజ్ తీసుకువచ్చింది. ఇప్పుడు సత్యరాజ్ తెలుగు, తమిళ భాషల్లోనే కాకుండా, సౌత్ భాషల్లో హిందీలో కూడా సినిమాలు చేస్తూ బిజీ అయ్యాడు. తాజాగా చాలా ఏళ్ళ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూడా కలిసి సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఎస్.ఎస్.రాజమౌళి తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేస్తుండగా, గత కొన్ని రోజులుగా సత్యరాజ్ SSMB29 సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే నటుడు సత్యరాజ్ తాజాగా ఈ వార్తలపై స్పందించడం జరిగింది.

Sathyaraj gave clarity on the news about SSMB29 movie

SSMB29 పై సత్యరాజ్ క్లారిటీ..

తమిళ నటుడు సత్యరాజ్ రాజమౌళి మహేష్ సినిమాలో నటిస్తున్నాడని వస్తున్న వార్తలకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాజాగా సత్యరాజ్ SSMB29 సినిమా గురించి స్పందిస్తూ, దర్శకుడు రాజమౌళికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని, ఆయన వల్లే తాను ఇండియా వైడ్ గా పాపులర్ అయ్యానని, వరుస అవకాశాలు వస్తున్నాయని అన్నారు. రాజమౌళి తీసిన బాహుబలి లో కట్టప్ప పాత్రే తనకు ఇన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని అన్నారు. ఇక మహేష్ రాజమౌళి సినిమా లో తాను నటించడం లేదని, ఆ వార్తలు అవాస్తవం అని అన్నారు. అయితే ఒకవేళ ఈ సినిమాలోనూ అవకాశం వస్తే.. అస్సలు వదులుకోనని సత్యరాజ్ స్పష్టం చేసారు. అలాగే ప్రభాస్ నటిస్తున్న కల్కి2898AD సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నానని చెప్పుకొచ్చారు.

- Advertisement -

బయోపిక్ పుకార్లపై కూడా స్పందించిన సత్యరాజ్

ఇక మొన్నా మధ్య నరేంద్ర మోడీ బయోపిక్ లో సత్యరాజ్ నటిస్తున్నాడనే వార్తలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఈ విషయం పైనా సత్యరాజ్ క్లారిటీ ఇచ్చాడు. తాజా ఇంటర్వ్యూలో సత్యరాజ్ మాట్లాడుతూ ‘ప్రధాని మోదీ బయోపిక్‌లో నేను నటిస్తున్నాననే వార్త నాకు కూడా తెలియని వార్తే. ఆ సినిమాలో పీఎం మోదీగా నటించమని ఎవరూ నన్ను సంప్రదించలేదు అన్నాడు. అలాగే తాను మోడీ విధానాలకు వ్యతిరేకమని, ఒక వేళ మోడీ బయోపిక్ ఆఫర్ వచ్చినా చేయను అని అన్నాడు. తాను పెరియర్ రామస్వామి ఫాలోవర్ అని చెప్పిన సత్యరాజ్, మోడీ బయోపిక్ ఎలా చేస్తానని అన్నాడు. తాను మోడీ విధానాలకు వ్యతిరేకమని కుండబద్ధలు కొట్టినట్టుగా చెప్పేశారు. ఇక ఆ మధ్య పెరియార్ రామస్వామి బయోపిక్ లో కూడా సత్యరాజ్ నటించడం జరిగింది. ఇక రీసెంట్ గా సత్యరాజ్ ‘వెపన్’ అనే చిత్రంలో నటించాడు. ఈ సినిమాలో ఈ చిత్రంలో సత్యరాజ్ మానవాతీతుడిగా నటించడం జరిగింది. ఇక ప్రస్తుతం నాలుగు తమిళ సినిమాల్లో నటిస్తున్న సత్యరాజ్ త్వరలో తెలుగులో ఓ బడా సినిమలో నటించేందుకు రెడీ అవుతున్నాడట.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు