Anjali Reaction on Balayya: ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన అంజలి… పోస్ట్ వైరల్

Anjali Reaction on Balayya: ఈ మధ్య కాలంలో నందమూరి బాలకృష్ణ పలు సినిమాల ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కి హాజరవుతున్న సంగతి తెలిసిందే. మరి వాటిలో సెన్సేషన్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఒకటి. ఈ సినిమా ఈవెంట్ కి సంబంధించి బాలయ్య పై కొన్ని అంశాలు ట్రోల్స్ అవుతూ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

బాలయ్య ను కావాలని కొంత మంది టార్టెట్ చేసి, ట్రోల్ చేస్తున్నారనే ప్రచారం ఉంది. కాగా, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటి అంజలి విషయంలో బాలయ్య చేసిన దురుసు ప్రవర్తన బాగా‌ వైరల్ అయింది. అయితే దీనికి ఎవరు సమాధానం చెప్పాలో వారి నుంచి తాజాగా సమాధానం వచ్చింది. బాలయ్య పై అంజలి లేటెస్ట్ గా ఓ పోస్ట్ పెట్టింది.

Anjali on Balakrishna
Anjali on Balakrishna

“మేము ఇద్దరం ఎప్పుడూ ఎంతో సన్నిహితంగా ఉంటాం. అలాగే ఇద్దరం ఒకరి పట్ల ఒకరం గౌరవం ఇచ్చుకుంటాం” అంటూ తన పోస్ట్ లో వివరించింది. అలాగే ఈవెంట్లో వారి మధ్య కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని వీడియో రూపంగా పెట్టింది. ఇక ఇందులో బాలయ్య ఆమెతో నవ్వుతూ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి అలానే ఆమెని తోసిన క్లిప్ కూడా ఉంది. మొత్తానికి బాలయ్య విషయంలో అంజలికే ఎటువంటి సమస్య లేదని తెలియజేసింది. ఈ పోస్ట్ తో బాలయ్య ప్రవర్తనతో అంజలి ఇబ్బంది పడింది అంటూ వచ్చిన వార్తలకు ఎండ్ కార్డ్ పడిందని చెప్పొచ్చు.

- Advertisement -

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు