Shiva ReRelease : వర్మ తెంచిన సైకిల్ చైన్.. అతి త్వరలో అంటూ పోస్ట్!

Shiva ReRelease : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ లో ప్రత్యేకంగా నిలుస్తుంది నాగార్జున “శివ” సినిమా. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం ఆ రోజుల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వర్మ తొలి సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం వర్మని ఆ రోజుల్లోనే పాన్ ఇండియా డైరెక్టర్ గా నిలబెట్టింది. అప్పటికే గీతాంజలి తో స్టార్ స్టేటస్ దక్కించుకున్న నాగార్జున శివ సినిమాతో టాలీవుడ్ లో అగ్ర హీరోల్లో ఒకడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అలాగే శివ ని హిందీలో కూడా నాగార్జున తోనే ప్రత్యేకంగా తెరకెక్కించి అక్కడ కూడా భారీ సక్సెస్ ని అందుకున్నాడు. నిజం చెప్పాలంటే ఈ ఒక్క సినిమాతోనే వర్మ సంచలన దర్శకుడిగా మారిపోగా, ఇప్పటికీ శివ అనే బ్రాండ్ తోనే వర్మ దర్శకుడిగా అవకాశాలు అందుకుటున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి జీవితాన్ని సినీ పరిశ్రమలో వర్మకి ఈ సినిమా అందించింది. అందుకే నేను మంచోడిని కాకపోయినా.. నాగార్జున అనే మంచి వాడు నాకు దొరికాడు కాబట్టే, “శివ” అనే అద్భుతం వచ్చిందని ఎంతో గర్వంగా, గొప్పగా చెబుతుంటాడు వర్మ. ఇక ఈ సినిమా తర్వాత వర్మ టాలీవుడ్ లో క్షణ క్షణం, గాయం వంటి చిత్రాలతో, బాలీవుడ్ లో రంగీలా, సత్య, సర్కార్ వంటి చిత్రాలతో ట్రెండ్ సెట్ చేసారు.

Shiva ReRelease Update given by Ram Gopal Varma

ఐకానిక్ సీన్ తో రీ రిలీజ్ చేస్తునట్టు వర్మ పోస్ట్..

ట్రెండ్ సెట్టింగ్ మూవీ శివ తర్వాత నాగార్జున రేంజ్ అంతకంతకు రెట్టింపు అయింది. ఇక ఈ సినిమాలో ఒక ఐకానిక్ సీన్ ఇండియా వైడ్ గా ట్రెండ్ క్రియేట్ చేసింది. కాలేజీ లో నాగార్జున సైకిల్ చైన్ తెంచి చేసిన ఫైట్ తో టాలీవుడ్ లో ఆయన స్థాయే మారిపోయింది. నాగార్జునకు సరికొత్త యాంగ్రీ యంగ్ మెన్ ఇమేజ్ ని తీసుకొచ్చిన సినిమా అది. అప్పటి యుత్ కి ఐకాన్ లా మారిపోయారు. ఇప్పటికీ ఆ సీన్ ఓ ట్రెండ్ సెట్టర్ లాంటిందే. ఎన్నో చిత్రాల్లో దాన్ని డిఫెరెంట్ గా రీ క్రియేట్ చేద్దామని భావించినా కుదరలేదు. అయితే ఇప్పుడీ చిత్రాన్ని వర్మ మళ్లీ రీ-రిలీజ్ (Shiva ReRelease) చేస్తున్నట్లు అఫిషియల్ గా ప్రకటించాడు. అతి త్వరలోనే 4కె పార్మెట్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ వీడియోని కూడా పోస్ట్ చేసారు. ఇందులో రాంగో పాల్ వర్మ సైకిల్ చైన్ లాగి చేతికి బిగిస్తాడు. నాగార్జున ఎక్స్ ప్రెషన్ తో సరిగ్గా మ్యాచ్ అయ్యేలా ఆ సీన్ చేసాడు. అప్పటి వాతావరణం ఎక్కడా చెక్కు చెదరకుండా ఎంతో నేచురల్ గా ఈ సీన్ ని “ఏఐ టెక్నాలజీ” తో రీక్రియేట్ చేసినట్లు తెలుస్తుంది.

- Advertisement -

నాగ్ ఫ్యాన్స్ వెయిటింగ్..

ఇక లేటెస్ట్ గా వర్మ పోస్ట్ చేసిన ఈ సీన్ తో నిజంగా వర్మ మళ్ళీ 35 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడని అభిమానులకు అనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నాగార్జున అలాగే, వర్మ అభిమానులు ఆ వీడియో చూసి పిచ్చెక్కిపోతున్నారు. శివ రీ – రిలీజ్ ఇప్పటికే ఆలస్యమైందని? ఎప్పుడో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అని పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఇప్పటికే టాలీవుడ్ లో రీ-రిలీజ్ ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ట్రెండ్ సెట్ చేసిన ఈ సినిమాకు ఆ రికార్డులని బ్రేక్ చేసే సత్తా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు మరి శివ రీ రిలీజ్ డేట్ ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు