Cinema Lovers Day : రూ.99 కే మల్టీప్లెక్స్ లో మూవీ చూసే గోల్డెన్ ఛాన్స్… మూవీ లవర్స్ స్పెషల్ డే ట్రీట్

Cinema Lovers Day : ఇప్పటిదాకా మదర్స్ డే, లవర్స్ డే ఇలా ఎన్నో స్పెషల్ డేలను చూశాం మనం. అలాగే మూవీ లవర్స్ కు ఈ రోజు ప్రత్యేకమైన రోజు. సినిమా పిచ్చి ఉన్న వాళ్ళ కోసమే ప్రత్యేకంగా మే 31న సినిమా లవర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందుకే థియేటర్లలో స్పెషల్ ట్రీట్ కూడా ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు సినిమాలను కేవలం రూ. 99కే థియేటర్లలో చూసే గోల్డెన్ ఛాన్స్ ను మూవీ లవర్స్ కు ఇస్తున్నారు.

రూ.99కే మల్టీప్లెక్స్ లో సినిమా

ప్రతి సంవత్సరం ‘సినిమా ప్రేమికుల దినోత్సవం’ జరుపుకుంటారు. మే 31వ తేదీ శుక్రవారం సినీ ప్రేమికులకు ప్రత్యేకం. భారతదేశంలోని చాలా మల్టీప్లెక్స్‌లలో మే 31న ఏ సినిమా చూసినా టిక్కెట్ ధర 99 రూపాయలు మాత్రమే. ఈ మేరకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. PVR Inox, Cinepolis మొదలైన మల్టీప్లెక్స్‌లలో ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ఈ వారం (మే 31) విడుదలవుతున్న సినిమాలను చూస్తున్న ప్రేక్షకులు ఈ ఆఫర్‌తో చాలా సంతోషంగా ఉన్నారు.

ఈ థియేటర్లలో మాత్రమే స్పెషల్ ఆఫర్

పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్, మిరాజ్, సిటీ ప్రైడ్, ఏషియన్ సినిమాస్, మూవీ టైమ్, మూవీ మ్యాక్స్ వంటి మల్టీప్లెక్స్‌లు ‘సినిమా లవర్స్ డే’ని జరుపుకుంటున్నాయి. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’, ‘ఫాస్ట్ చార్లీ’, ‘సావి’, ‘స్ట్రేంజర్స్’ వంటి సినిమాలను కేవలం 99 రూపాయలకే చూసే అవకాశం సినీ ప్రియులకు లభిస్తుంది. ఈ ఆఫర్ ఒక రోజు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. లగ్జరీ సీట్లకు ఈ ఆఫర్ వర్తించదు.

- Advertisement -

Watch movies at Rs 99 on May 31st

ఇదే అసలు టార్గెట్

ఈ మధ్య కాలంలో థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. టిక్కెట్ల ధర ఎక్కువగా ఉండటమే ఇలా జరగడానికి గల ప్రధాన కారణాలలో ఒకటి. ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో అన్ని సినిమాల టిక్కెట్ ధర చాలా ఎక్కువగానే ఉంటుంది. ప్రత్యేక రోజుల్లో కేవలం 99 రూపాయలకే సినిమా టిక్కెట్లు అమ్ముడైతే సినిమా చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రేక్షకులు వస్తుంటారు. అందుకోసం ప్రత్యేకంగా ‘సినిమా ప్రేమికుల దినోత్సవం’ను జరుపుకుంటున్నారు.

కరోనా తరువాత తగ్గిన ఆక్యుపెన్సీ

క‌రోనా వైర‌స్ వచ్చి వెళ్ళాక త‌ర్వాత మ‌ల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేట‌ర్ల‌కు వ‌చ్చి సినిమాలు చూసే వారి సంఖ్య బాగా త‌గ్గింది. మళ్లీ ప్రేక్షకులను ఆకర్షించేందుకు మల్టీప్లెక్స్‌లు కొత్త వ్యూహంతో వచ్చాయి. ‘సినిమా ప్రేమికుల దినోత్సవం’ పేరుతో ఆఫర్ ధరకే టిక్కెట్లు అందజేసి జనాలను ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు.

స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా?

అయితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి మల్టీప్లెక్స్ లు ప్లాన్ చేసిన ఈ స్ట్రాటజీ పెద్దగా వర్కౌట్ కాకపోవచ్చు. ఆఫర్ ఉన్న ఒక్కరోజు జనాలు థియేటర్లకు ఎగబడినా తరువాత వాళ్ళను రప్పించడం కష్టమే. ఎందుకంటే మల్టీప్లెక్స్ లలో టిక్కెట్ ధరలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ ఒక్కరోజు ఆఫర్ తో మల్టీప్లెక్స్ యాజమాన్యం ఎంత వరకు లాభాలను పొందుతుంది అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు