Actress Sadha : సెగలు రేపుతున్న సీనియర్ బ్యూటీ సదా అందాలు..!

Actress Sadha : ఒకప్పటి స్టార్ హీరోయిన్ సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ ”జయం” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై “వెల్లవయ్యా వెళ్ళు వెళ్ళు” అంటూ ఆ డైలాగుతో, తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఫేమస్ అయిపోయింది. ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నటువంటి ఈ బ్యూటీ…. అచ్చతెలుగు అమ్మాయిల లంగా వోని వేసుకొని ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరించింది. ఆ సినిమా అనంతరం “నాగ” సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించింది “ఔనన్నా కాదన్నా”, “దొంగ దొంగది”, “అపరిచితుడు”, “అహింస” వంటి ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. దీంతో ఈ అమ్మడు తమిళ సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ బ్యూటీ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి ఎనలేని గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం సదా “డీ జోడి”, “నీతోనే డాన్స్” వంటి షోస్ లలో జడ్జిగా వ్యవహరిస్తోంది. సదాకి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తూ భారీగానే డబ్బులను సంపాదిస్తుంది.

అంతేకాకుండా సినిమాల్లో నటిస్తూ, పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ డబ్బులను సంపాదిస్తోంది. సదా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటోలతో తన అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో సదా పింక్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని చాలా అందంగా కనిపించింది.

- Advertisement -

ఈ డ్రెస్ లో బార్బీ డాల్ లా ఉందని తన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలో సదా ఎంతో అందంగా, కుందనపు బొమ్మలాగా ఉందని తన అభిమానులు అంటున్నారు. అంతేకాకుండా మరికొందరు ఏమో సదా చాలా హాట్ గా ఉందని అంటున్నారు. ఏది ఏమైనా అప్పటికి సదా ఎంత వయసు వచ్చినా కూడా ఇప్పటికీ యంగ్ గానే కనిపిస్తూ ఎంతో అందంగా ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు