Kavya Kalyanram: బాత్రూంలో కావ్య అలాంటి పనులు ?

Kavya Kalyanram: కావ్య కళ్యాణ్ రామ్… ఈ భామ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా మారింది. కావ్య 2003 సంవత్సరంలో వచ్చిన గంగోత్రి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ సినిమా అనంతరం చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చి తన పూర్తి దృష్టి చదువుపై పెట్టింది. షార్ట్ ఫిలిమ్స్ తో పాటుగా సినిమాల్లో కొన్ని సహాయ పాత్రల్లో నటించింది.

“మసూద” సినిమాలో ప్రధాన పాత్ర పోషించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా అనంతరం వేణు దర్శకత్వం వహించిన బలగం సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో కావ్యకు నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో కావ్యకు వరుస సినిమా అవకాశాలు వస్తాయని అంతా ఊహించారు. కానీ అనుకున్నంత మేర అవకాశాలు రాకపోవడంతో ఈ బ్యూటీ కాస్త డైలామాలో పడిందట.

Kavya Kalyanram latest photoshoot wiral on instagram

- Advertisement -

ప్రస్తుతం ఈ బ్యూటీ ఆడపదడపా సినిమాల్లో నటిస్తోంది. ఈమధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. తరచూ ఫోటో షూట్లు చేస్తూ షాక్ ఇస్తోంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ బ్యూటీకి సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో కాస్త బాధపడుతోంది. తాజాగా ఈ విషయమై ఎమోషనల్ అయిన కావ్య బాత్రూంలో కూర్చుని బోరున ఏడ్చేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఏది ఏమైనాప్పటికీ….కావ్యాకు మళ్ళి సినిమాల్లో అవకాశాలు రావాలని తన అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు