OTT Movie : మొదటి భార్యకు అనుమానం రాకుండా రెండో భార్యతో ఆ పని… ప్యూజులు ఔట్ అయ్యే టెక్నాలజీ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఇదివరకు టెక్నాలజీ, సైంటిఫిక్ అనగానే హాలీవుడ్ సినిమాలు మాత్రమే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు టైం మారింది. హాలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఇండియన్ సినీ పరిశ్రమలో కూడా అదిరిపోయే సైన్స్ ఫిక్షన్ మూవీలు తీస్తూ తమ టాలెంట్ ను ప్రూవ్ చేస్తున్నారు ఇండియన్ దర్శక నిర్మాతలు. ప్రస్తుతం ఓటిటిలో ఎన్నో అదిరిపోయే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే మంచి మైండ్ బెండింగ్ ట్విస్టులు ఉండే టైం ఫిక్షన్ క్రైమ్ స్టోరీల గురించి సర్చ్ చేస్తున్న వాళ్ల కోసమే ఈ మూవీ సజెషన్. ఇంతకీ ఈ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే విషయంలోకి వెళ్తే…

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు కాపీ. కనీసం ఈ పేరును కూడా చాలామంది విని ఉండరు. ఎందుకంటే ఆ మూవీ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది అన్న విషయం కూడా ఎవరికీ తెలీదు. అయితే ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీలో నటించిన హీరో 12th ఫెయిల్ తో ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన విక్రాంత్ మస్సే. ప్రస్తుతం ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రిమింగ్ అవుతోంది. కానీ మైనస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది. ఒకవేళ భాషతో ప్రాబ్లం లేదు అనుకుంటే హిందీలో, లేదంటే అవైలబుల్ గా ఉన్న ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ మూవీని చూడాలనుకునేవారు చూడొచ్చు.

#Copy By Arindam Sil – Teen Paheliyan | Facebook

ఈ మూవీ స్టోరీ ఏంటంటే ?

ఓ వ్యక్తి చిన్నిలు పెద్దిల్లు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. అయితే మొదటి భార్యకు అనుమానం రాకుండా తన రెండో భార్యతో గడపడానికి గట్టి ప్లాన్ వేస్తాడు. అందులో భాగంగానే చిన్న ఇంట్లో కాపురం పెట్టడానికి ఒక రోబోని కొంటాడు. తను అందుబాటులో లేని సమయంలో ఆ రోబో కుటుంబంతో గడపడంతో పాటు వ్యాపారాన్ని చూసుకోవడం వంటివి చేస్తుంది అనే ఉద్దేశంతో ఆ పని చేస్తాడు.

- Advertisement -

కానీ ఆ రోబో అతనికి ఊహించని షాక్ ఇస్తుంది. ఏకంగా మనిషి స్థానాన్ని లాక్కోవాలని అనుకుంటుంది రోబో. అంటే ఇద్దరు భార్యలకు భర్తగా, వ్యాపారాలకు యాజమానిగా ఒరిజినల్ మనిషి ప్లేస్ లోకి రావాలని చూస్తుంది. ఆ తర్వాత హీరోకి రోబోకి మధ్య ఏం జరిగింది? హీరో జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? చివరికి కథ ఎలా ముగిసింది? అనే విషయాలు తెలియాలంటే కాపీ అనే మూవీని చూసి తీరాల్సిందే. నిజానికి ఇది షార్ట్ ఫిలిం లాగా ఉంటుంది. రన్ టైమ్ తక్కువగా ఉంటుంది కాబట్టి డాక్యుమెంటరీలా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ తీరా మూవీని చూశాక మనసులో ఎన్నో అనుమానాలు, భయాలు కలుగుతాయి. అంతేకాకుండా టెక్నాలజీనే జీవితం అనుకుంటే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయి అనే విషయం స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించారు ఈ మూవీలో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు