Sobhita Dhulipala: నాగర్జున సినిమాలో చైతూ బ్యూటీ ?

స్టార్‌ హీరోయిన్‌ శోభిత ధూళిపాళ ఈ బ్యూటీ గురించి ప్రతి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో, కథానాయికగా ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న శోభిత ప్రతి ఒక్కరికి సుపరిచితమే. శోభిత తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ హాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. తెలుగు, హిందీ, తమిళ భాషలలో పలు చిత్రాల్లో నటించి అభిమానులను అలరిస్తోంది.

శోభిత మోడలింగ్ తో తన కెరీర్ ప్రారంభించి సినిమా ప్రపంచంలో తన హవాను కొనసాగిస్తోంది. దేవ్ పటేల్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ మంకీ మ్యాన్ సినిమాతో హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ. ఇది ఇలా ఉండగా….గత కొంతకాలం నుంచి అక్కినేని నాగచైతన్య, శోభిత డేటింగ్ లో ఉన్నట్లు పలు రకాల వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరూ కలిసి ఓ హోటల్ లో కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని అందరూ అనుకున్నారు.

- Advertisement -

అంతేకాకుండా వీరికి సంబంధించిన ఫోటోలు ఎప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వీరిద్దరిపై ఎన్నో రకాల రూమర్స్ వస్తున్నప్పటికీ ఆ వార్తలపై ఇప్పటివరకు వీరు స్పందించలేదు. తాజాగా ఈ బ్యూటీ ఓ స్టార్ హీరోతో జతకట్టనుందని వార్తలు వస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు అక్కినేని నాగార్జున. నాగార్జునతో హీరోయిన్ గా నటించనుందట.

ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాగార్జున 100వ సినిమాలో శోభిత హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసినప్పటి నుంచి కోడలు కావాల్సిన అమ్మాయితో రొమాన్స్ ఏంటి…? అలా చేయడం పెద్ద తప్పు అని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఇందులో నిజం ఎంత అనేది తెలియనప్పటికీ ఈ విషయం తెలిసినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు