Star Couple Breakup : ఇటీవల కాలంలో తరచుగా సెలబ్రిటీలు విడాకుల బాట పట్టడం వంటి విషయాలను చూస్తూనే ఉన్నాము. తాజాగా మరో సెలబ్రిటీ కపుల్ విడిపోతున్నారనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇంతకీ ఆ స్టార్ కపుల్ ఎవరు? అనే వివరాల్లోకి వెళ్తే…
మలైకా, అర్జున్ బ్రేకప్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ల బంధానికి మళ్లీ బ్రేక్ పడింది. 2017లో నటుడు అర్బాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకున్న తర్వాత అర్జున్ కపూర్ మలైకా జీవితంలోకి ప్రవేశించాడు. 2019లో మలైకా-అర్జున్ తమ రిలేషన్ గురించి బయట పెట్టారు. ఈ జంట అప్పటి నుంచి గత 8 సంవత్సరాలుగా కలిసి ఉన్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య బ్రేకప్ జరిగింది అనే టాక్ ఊపందుకుంది. కొద్ది రోజుల క్రితం నుంచే మలైకా-అర్జున్ ల రిలేషన్ షిప్ లో విబేధాలు వచ్చాయనే వార్తలు రాగా, చివరకు వీరిద్దరూ విడిపోయారని సమాచారం.
పరస్పర అంగీకారంతోనే…
తాజా సమాచారం ప్రకారం విడిపోయినప్పటికీ మలైకా, అర్జున్ ఒకరినొకరు గౌరవించుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. వీరిద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోవాలనే నిర్ణయం కూడా తీసుకున్నారని, ఇప్పుడు వీరి రిలేషన్ షిప్ ప్రయాణం ముగిసిందని తెలుస్తోంది. అంతేకాదు మలైకా, అర్జున్ మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనదని, ఇద్దరి హృదయాల్లో ఒకరికొకరు ప్రత్యేక స్థానం ఇచ్చుకున్నారని అంటున్నారు.
బ్రేకప్ గురించి నో కామెంట్స్
ప్రస్తుతం బ్రేకప్ వార్తలు వైరల్ అవుతుండగా, ఇద్దరూ తమ రిలేషన్షిప్ గురించి మౌనంగా ఉన్నారు. మలైకా-అర్జున్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. ముందుముందు కూడా ఇలాగే బ్రేకప్ పై మౌనంగా ఉండాలని ఈ జంట నిర్ణయించుకుందని సమాచారం. అంతేకాదు విడిపోయినప్పటికీ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ఇద్దరూ ఒకరికొకరు అండగా నిలుస్తారని, ప్రజలు తమ గోప్యతను గౌరవించాలని ఈ జంట కోరుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం మలైకా-అర్జున్‌ల రిలేషన్‌షిప్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది.
ఏడాది క్రితమే వార్తలు
నిజం చెప్పాలంటే ఈ ఏడాది జనవరి నెలలో మలైకా-అర్జున్‌ల బ్రేకప్ చర్చనీయాంశమైంది. కానీ వారిద్దరూ రిలేషన్‌షిప్‌ను ముగించే బదులు సర్దుకుపోవాలని నిర్ణయించుకున్నారు. ఇంతలో అర్బాజ్ ఖాన్ వివాహం తర్వాత, అందరి దృష్టి అర్జున్ , మలైకాపై పడింది. అదే సమయంలో అర్జున్, మలైకా పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చాయి.
మలైకా సోషల్ మీడియాలో అర్జున్ కుటుంబంలోని చాలా మంది సభ్యులను అన్‌ఫాలో చేసింది. దాంతో బ్రేకప్ ఊహాగానాలు మొదలయ్యాయి. నిజానికి అర్జున్ కుటుంబంతో మలైకాకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ విడాకులు తీసుకున్న మలైకాను తన కొడుకు భార్యగా చేసుకోవడానికి బోనీ కపూర్ అస్సలు సుముఖంగా లేడని టాక్ నడిచింది.
12 ఏళ్ల వయసు వ్యత్యాసం
ఇక వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అనే విషయం తెలియగానే తెరపైకి వచ్చిన విషయం వీళ్లిద్దరి మధ్య వయసు తేడా. అర్జున్ కపూర్ మలైకా కంటే 12 ఏళ్లు చిన్నవాడు. కానీ వారిద్దరి మధ్య ప్రేమకు ఇదేమి అడ్డు కాలేదు. ఏదైతేనేం చివరకు వీరిద్దరూ విడిపోయినట్లు సమాచారం.