Naga Chaitanya: మళ్లీ దొరికిపోయిన శోభిత, చైతూ ?

Sobhita Dhulipala And Naga Chaitanya Spotted Wine Tasting in Europe: అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగార్జున వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు అక్కినేని నాగ చైతన్య. తన కెరీర్ ప్రారంభంలో జోష్, 100% లవ్ లాంటి సినిమాలు చేసి… టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా… ఎదిగేందుకు చాలా కష్టపడుతున్నాడు.

అంతేకాకుండా… ఏం మాయ చేసావే సినిమా సమయంలోనే… హీరోయిన్ సమంతను ప్రేమించాడు అక్కినేని నాగ చైతన్య. అనంతరం ఐదు సంవత్సరాల పాటు వీరిద్దరు ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగచైతన్య అలాగే.. సమంతాల వివాహం చేశారు అక్కినేని నాగార్జున. కానీ వీరి జీవిత బంధం ఎక్కువ రోజులు నిల్వలేకపోయింది. 2017 సంవత్సరంలో అక్కినేని నాగచైతన్య మరియు సమంత వివాహం జరగగా… 2021 డిసెంబర్లో వీరిద్దరు విడిపోయారు.

Sobhita Dhulipala And Naga Chaitanya Spotted Wine Tasting in Europe See Pic

విడాకులపై ఎలాంటి కారణాలు చెప్పకుండానే వీరిద్దరు విడిపోయారు … ఇక అప్పటినుంచి నాగచైతన్య మరియు సమంత విడివిడిగానే ఉంటున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత అక్కినేని నాగచైతన్య మరియు సమంత ఎవరిదారి వారిదే అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు ఈ ఇద్దరు. అయితే… సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత అక్కినేని నాగచైతన్య గురించి చాలా రూమర్స్ వస్తున్నాయి.

- Advertisement -

Chay & Sobhita At Wine Tasting Session in Europe?

హీరోయిన్ శోభిత దూళిపాళ్ల తో అక్కినేని నాగచైతన్య డేటింగ్ లో ఉన్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. చాలాసార్లు వీరిద్దరూ ఒకే చోట ఉండటం కూడా మనం తరచూ చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటివరకు వీరిద్దరూ తమ రిలేషన్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇలాంటి నేపథ్యంలో మరోసారి… అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల దొరికిపోయారు.

అయితే తాజాగా యూరప్ ట్రిప్ కు శోభిత అలాగే నాగచైతన్య వెళ్ళినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ వైన్ టెస్ట్ పార్టీ జరుగుతుండగా…. శోభిత మరియు నాగచైతన్య అక్కడ మెరిసారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో నిజంగానే డేటింగ్ లో ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు