Gam Gam Ganesha Movie Review : ‘గం గం గణేశా’ మూవీ రివ్యూ

Gam Gam Ganesha Movie Review : ‘బేబీ’ తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన సినిమా ‘గం గం గణేశా’. కొన్ని కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిన ఈ సినిమా.. ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందో.. నొప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం రండి..

కథ :

వినాయక చవితి ఉత్సవాల చుట్టూ జరిగే కథ ఇది. గణేశ్(ఆనంద్ దేవరకొండ) ఓ అనాధ.స్నేహితుడు శంకర్ (జబర్దస్త్ ఇమాన్యూయల్)తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. మరోపక్క శృతి (నయన్ సారిక)తో అనే ప్రేమలో ఉంటాడు. కానీ శృతి ఓ ధనవంతుడిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుంది.దీంతో గణేశ్.. కూడా ధనవంతుడు అయిపోవాలని.. ఓ వజ్రాన్ని దొంగతనం చేసే డీల్ ఒప్పుకుంటాడు. అయితే దాన్ని దొంగిలించే క్రమంలో ఇతను లేనిపోని సమస్యలు నెత్తినేసుకుంటాడు. అవేంటి? డైమండ్ దొంగతనం డీల్ కోసం గణేష్ వేసిన ప్లాన్స్ ఏంటి?మధ్యలో గణేశ్ విగ్రహాల వల్ల కథ ఎలా మారింది? మధ్యలో నీలవేణి (ప్రగతి శ్రీవాస్తవ) ఈ క్రైమ్లో ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి ఉంది.? ఈ ప్రశ్నలకి సమాధానమే ఈ ‘గం గం గణేశా’.

విశ్లేషణ :

‘గం గం గణేశా’ కథ పరంగా ఎంత మాత్రం కొత్తగా ఉండదు. ఇంకో రకంగా దీనికి ‘స్వామిరారా2’ అనే టైటిల్ పర్ఫెక్ట్ ఏమో అనిపిస్తుంది. అలాగే మొదటి 5 నిమిషాల్లో కనిపించిన క్రైమ్.. ఆ తర్వాత కనిపించదు. పూర్తిగా కామెడీనే హైలెట్ అయ్యింది అనిపిస్తుంది. దర్శకుడు ఉదయ్ బొమ్మిశెట్టి తన టేకింగ్ తో పర్వాలేదు అనిపించాడు. ఫస్ట్ హాఫ్ సాగదీతతో నిండి ఉన్నప్పటికీ కామెడీ మెప్పించే విధంగానే ఉంటుంది. మొదటి 40 నిమిషాలు సహనాన్ని పరీక్షించే విధంగానే ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ టేకింగ్ పరంగా బాగుంది. కామెడీ బాగానే వర్కౌట్ అయ్యింది. రొటీన్ అనే ఫీలింగ్ వచ్చిన ప్రతిసారి కామెడీ సీన్స్ ఆదుకున్న ఫీలింగ్ కలుగుతుంది. చైతన్ భరద్వాజ్ సంగీతం పాస్ మార్కులు వేయించుకుంటుంది. పాటలు పెద్దగా గుర్తుండవు. కానీ నేపధ్య సంగీతం కథకి తగ్గట్టు బాగానే సెట్ అయ్యింది. ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రఫీ కూడా ఓకే. విజువల్స్ బాగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా కథకి తగ్గట్టు బాగానే సెట్ అయ్యాయి.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే..

‘బేబీ’ లో ఎమోషనల్ యాంగిల్ చూపించి యూత్ కి బాగా కనెక్ట్ అయిన ఆనంద్ దేవరకొండ.. ఈ సినిమాలో తన కామెడీ యాంగిల్ ను కూడా బయటకి తీశాడు. టాటూతో అతను పలికిన డైలాగులు యూత్ కి కచ్చితంగా కనెక్ట్ అవుతాయి. చాలా ఈజ్ తో అతను ఈ పాత్ర చేశాడు అని చెప్పొచ్చు. జబర్దస్త్ ఇమాన్యూయల్ కి చాలా రోజుల తర్వాత లెంగ్తీ రోల్ దొరికింది. అతను కూడా బాగా కామెడీ పండించాడు. భవిష్యత్తులో ఇలాంటి రోల్స్ అతనికి మరిన్ని వచ్చే ఛాన్స్ ఉంది. వీళ్ళ తర్వాత తప్పకుండా చెప్పుకోవాల్సిన పాత్ర ఏమైనా ఉందా అంటే అది కచ్చితంగా వెన్నెల కిషోర్ పాత్ర అనే చెప్పాలి. ఇతను కనిపించినంత సేపు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. అప్పటివరకు నార్మల్ గా సాగుతున్న సినిమా వెన్నెల కిషోర్ ఎంటర్ అయ్యాక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది అని చెప్పొచ్చు. హీరోయిన్లు ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక పాత్రలకి పెద్దగా ప్రాధాన్యత లేదు. కానీ గ్లామర్ అవసరం కాబట్టి.. ఉన్నారు అనుకోవాలి అంతే..! ‘సత్యం’ రాజేశ్ పాత్ర కూడా పర్వాలేదు. రాజ్ అర్జున్, కృష్ణ చైతన్య .. వంటి వారు కూడా పర్వాలేదు అనిపిస్తారు.

ప్లస్ పాయింట్స్ :

కామెడీ

సెకండ్ హాఫ్

వెన్నెల కిషోర్

మైనస్ పాయింట్స్ :

కథ పెద్దగా లేకపోవడం
ఫస్ట్ హాఫ్ లో సాగదీత

మొత్తంగా..

‘గం గం గణేశా’ లో ఎంటర్టైన్మెంట్ ఉంది. థియేటర్ కి కచ్చితంగా వెళ్లి చూడాల్సిన సినిమా ఏమీ కాదు.. అలా అని వెళ్లినా డిజప్పాయింట్ అయితే చేయదు.

రేటింగ్ : 2.25 /5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు