Ananth-Radhika Pre Wedding : ఒక్కరోజు ప్రదర్శన కోసం కోట్లలో డబ్బు గుమ్మరించిన అంబానీ..

Ananth-Radhika Pre Wedding : మామూలుగా ఒక ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పెళ్లి ఖర్చులు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. కానీ ఒక సినిమా లేదా, రాజకీయ ఫ్యామిలీ ల సెలెబ్రిటీల పెళ్లిలో ఎంత గ్రాండ్ గా జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలో సూపర్ స్టార్లు గా రానిస్తున్న వాళ్ళ వారసుల పెళ్లిళ్లు అయితే కోట్లు గుమ్మరించి చేస్తారు. దాదాపు వంద నుండి ఐదు వందల కోట్ల ఖర్చుతో కూడా పెళ్లిళ్లు చేసిన దాఖలాలున్నాయి. అలాంటిది సెలెబ్రిటీలే పెళ్లి లో ప్రదర్శన ఇస్తే ఏ రేంజ్ లో ఛార్జ్ చేస్తారో ఊహించలేకపొతున్నారు కదా.. రీసెంట్ గా ముఖేష్ అంబానీ కొడుకు అనంత అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకకు హాలీవుడ్ నుండి కూడా ఫేమస్ పాప్ సింగర్స్ ని, డాన్సర్స్ లని పిలిపించి ప్రదర్శన ఇప్పించారు అంబానీ. ఈ వేడుకకి వచ్చి ఒక్కరోజు ప్రదర్శన ఇచ్చినందుకు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని గుమ్మరించారట అంబానీ. ఇక అందులో ఎవరెవరో భారీ పారితోషకాలు తీసుకున్నారో ఒక అంచనాకి వస్తే.. లెక్కలు ఇలా ఉన్నాయి.

Shakira Remunaration For Ananth-Radhika Pre Wedding

కోట్లు గుమ్మరించిన అంబానీ..

ముఖేష్ అంబానీ వారసుడు అనంత్ అంబానీ (Ananth-Radhika Pre Wedding) తన ప్రియమైన రాధికా మర్చంట్‌ను జూలై 12న ముంబైలో వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఆ రోజుకి ముందు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు లగ్జరీ క్రూయిజ్ షిప్‌లో వివాహానికి ముందు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇక వచ్చిన సమాచారం ప్రకారం, రెండవ ప్రీ-వెడ్డింగ్ మహోత్సవంలో గ్లోబల్ సూపర్ స్టార్ షకీరా ప్రదర్శన ఉంటుంది. అనంత్ అంబానీ – రాధిక మర్చంట్ క్రూయిజ్ పార్టీ కోసం షకీరా రెమ్యూనరేషన్ వివరాలు తాజాగా బయటికి వచ్చాయి. వివాహానికి 4 రోజుల ముందు వేడుకలో లగ్జరీ ఫ్రెంచ్ క్రూయిజ్‌లో షకీరా తన ఎనర్జిటిక్ ప్రదర్శనతో అతిథులను అలరిస్తుంది. దీని కోసం భారీ మొత్తంలో ఛార్జ్ చేస్తుందట. ఈ వెడ్డింగ్ వేడుకలో షకీరా 10 నుండి రూ. 15 కోట్ల వరకు అందుకుంటున్నట్లు సమాచారం. అలాగే బ్యాక్ స్ట్రీట్ బాయ్స్ ప్రదర్శనకు 7 కోట్లు, అమెరికన్ పాప్ సింగర్ కెటి పెర్రీ కి 5 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారట.

- Advertisement -

వందల కోట్ల ఖర్చుతో పెళ్లి వేడుకలు..

ఇక ఇక అనంత – రాధిక ల పెళ్లి వేడుక (Ananth-Radhika Pre Wedding) గుజరాత్‌లోని జామ్‌ నగర్‌లో చేసినపుడు, ప్రదర్శన ఇవ్వడానికి రిహన్నను తీసుకువచ్చి దేశాన్ని ఆశ్చర్యపరిచారు. రూ. 74 కోట్లు ఖర్చు చేసిన పాప్ ఐకాన్ ప్రదర్శన ఇప్పటికే ఈ సంవత్సరం లో హైలైట్‌గా మారింది. ఇక అనంత్ అంబానీ-రాధిక వివాహ తేదీ జూలై 12న ముంబైలో గ్రాండ్ హిందూ వేద వేడుకలో వివాహం చేసుకోనున్నారు. ఆ తర్వాత జూలై 14న ఆకర్షణీయమైన రిసెప్షన్ జరగనుంది. ఇక ఈ వేడుక కు దేశదేశాల నుండి ప్రముఖ బిజినెస్ మెన్స్, అలాగే దేశంలో ఉన్న రాజకీయ ప్రముఖులు, నేతలు, సినీ ప్రముఖులు, ఇతర రంగాల్లో ఉన్న ప్రముఖులు ఈ వేడుకకు హాజరవనున్నారు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు