Bhaiyya Ji : ఊహించని రెస్పాన్స్ తెచ్చుకున్న విలక్షణ నటుడి వందో చిత్రం..

Bhaiyya Ji : ఇండియాలో విలక్షణ నటులుగా పేరు తెచ్చుకున్న అటు తక్కువమంది నటుల్లో “మనోజ్ బాజ్ పాయ్” ఒకరు. హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ వంటి భాషల్లో తన విలక్షణమైన పాత్రలతో అద్భుతమైన నటుడుగా పేరు తెచ్చుకున్నఈయన తెలుగులోనూ జేడి చ‌క్ర‌వ‌ర్తి ‘స‌త్య‌’, అల్లు అర్జున్ ‘హ్యాపీ’, పవన్ కళ్యాణ్ కొమరం పులి వంటి చిత్రాల్లో మ‌నోజ్ భాజ్ పాయ్ న‌టించి తెలుగు ప్రేక్ష‌కులకూ చేరువయ్యారు. ఇక ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్‌తో అత‌డు ఇండియా వైడ్ గా పాపులర్ హీరో అయ్యాడు. అయితే ఈ మధ్యకాలంలో అత‌డు సోలో లీడ్‌గా కూడా న‌టిస్తూ ఆక‌ట్టుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా మనోజ్ బాజ్ పాయ్ “భ‌య్యాజీ” (Bhaiyya Ji) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఊహించని రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది.

Manoj Bajpayee  Bhaiyya Ji Movie First Week Collections

ఊహించని రెస్పాన్స్ తెచ్చుకున్న భయ్యా జి..

మనోజ్ బాజ్‌పేయి ప్ర‌ధాన పాత్ర‌లో అపూర్వ్ సింగ్ కర్కి దర్శకత్వం వహించిన రివెంజ్ డ్రామా ‘భయ్యా జీ’ ఈ శుక్రవారం విడుద‌లై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. క్రిటిక్స్ పరంగా మంచి రివ్యూలు వచ్చినా, ఆడియన్స్ నుండి మాత్రం అంతగా రెస్పాన్స్ రావడం లేదు. ఇక ‘ఫ్యామిలీమ్యాన్’ స్టార్ గా అంద‌రి హృద‌యాల్లో నిలిచిన మ‌నోజ్ కెరీర్‌లో 100వ చిత్రం కావ‌డంతో దీనిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. కానీ భయ్యాజీ దురదృష్టవశాత్తు బాక్సాఫీస్ వద్ద నెమ్మదిగా ప్రారంభమైంది. ఇప్ప‌టికి ఈ చిత్రం దాదాపుగా థియేటర్లలో మొదటి వారాన్ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద హిట్టా? ఫ్లాపా? అనేది నిర్ణయించాల్సింది కలెక్షన్ల ద్వారానే.

- Advertisement -

డిజాస్టర్ ఓపెనింగ్స్ అందుకున్న భయ్యాజీ..

ఇక భయ్యా జీ (Bhaiyya Ji) బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వివ‌రాల్లోకి వెళితే.. ‘భయ్యా జీ’ తొలి వారం ఓ మోస్త‌రు వ‌సూళ్ల‌ను మాత్ర‌మే సాధించింది. ఫస్ట్ డే రోజు (శుక్రవారం) రూ. 1.35 కోట్లు నిరాశాజనకమైన ప్రారంభం తర్వాత, వరుసగా శనివారం రూ. 1.75 కోట్లు, ఆదివారం రూ. 1.90 కోట్లు సంపాదించింది. ఆ తర్వాత సోమవారం భారీ డ్రాప్స్ ను చ‌విచూసి, కేవలం రూ. 0.90 కోట్లు ,మంగళవారం రూ. 0.85 కోట్లు, బుధవారం రూ. 0.77 కోట్లు, మొత్తంగా ఇండియా వైడ్ క‌లెక్ష‌న్లు రూ. 7.49 కోట్లకు చేరుకోగా, ప్రపంచవ్యాప్తంగా సుమారుగా. 8.22 కోట్లు మాత్ర‌మే ఆర్జించింది. ఓవరాల్ గా మొదటి వారం తర్వాత కూడా ఈ చిత్రం రూ.10 కోట్ల మార్కును అధిగమించలేక పోయింది. బాక్సాఫీస్ వసూళ్లలో స్థిరమైన తగ్గుదల క‌నిపిస్తోంది. 20 కోట్ల బ‌డ్జెట్ తో తెరకెక్కిన మనోజ్ బాజ్ పాయ్ చిత్రం ఇలా డిజాస్టర్ అవుతుందని అనుకోలేదు ఎవ్వరూ. ఇక ఈ సినిమా లోప్ర‌థ‌మార్థం ఆక‌ట్టుకున్నా ద్వితీయార్థం పూర్తిగా ఫెయిలైంద‌ని విమ‌ర్శ‌లొచ్చాయి. ద‌ర్శ‌కుడు అపూర్వ్ సింగ్ వైపే అన్నివేళ్లు చూపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మనోజ్ బజ్ పాయ్ హిట్ ప్లాప్ ల సంగతి ఏమి పట్టించుకోకుండా తన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు