Bhaje Vaayuvegam Movie Review : ‘భజే వాయు వేగం’ మూవీ రివ్యూ

Bhaje Vaayuvegam Movie Review : కార్తికేయ గుమ్మకొండ.. ‘ఆర్.ఎక్స్.100 ‘ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో బ్లాక్ బస్టర్ కొట్టలేకపోయాడు. అయితే గతేడాది రిలీజ్ అయిన ‘బెదురులంక 2012’ తో ఓ డీసెంట్ సక్సెస్ అందుకుని ఫామ్లోకి వచ్చాడు. అతను హీరోగా తెరకెక్కిన మరో యాక్షన్ మూవీ ‘భజే వాయు వేగం’. పెద్దగా ప్రమోషన్ డోస్ లేకుండా..ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ‘యూవీ కాన్సెప్ట్స్’ సంస్థ పై రూపొందిన ఈ చిత్రం పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజ్ అయ్యింది అని చెప్పాలి. మరి ఈ సినిమాతో కార్తికేయ మరో సక్సెస్ అందుకున్నాడా? లేదా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి.

కథ :

అప్పుల బాధ తట్టుకోలేక వెంకట్(కార్తికేయ) తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. దీంతో అతని స్నేహితుడు రాజు(రాహుల్ హరిదాస్) తండ్రి (తనికెళ్ల భరణి) అతన్ని చేరదీసి తన చిన్న కొడుకులా పెంచుకుంటాడు. రాజు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాను అని అతని తండ్రికి చెప్పి ఓ ఫైవ్ స్టార్ హోటల్లో పార్కింగ్ సెక్షన్లో పనిచేస్తూ ఉంటాడు. మరోపక్క పెద్ద క్రికెటర్ అవుతాడు అనుకున్న రాజు కొన్ని కారణాల వల్ల బెట్టింగ్లు వేసుకుంటూ ఉంటాడు. ఒక రోజు ఈ విషయం వీళ్ళ తండ్రికి తెలుస్తుంది. ఆ షాక్ వల్ల అతను హాస్పిటల్ పాలవుతాడు. ట్రీట్మెంట్ కోసం రూ.20 లక్షలు ఖర్చవుతుంది అని డాక్టర్లు చెబుతారు. ఆ డబ్బుల కోసం వీళ్ళు ప్రయత్నిస్తూ ఉండగా.. డేవిడ్(రవి శంకర్) మేయర్ జార్జ్(శరత్ లోహిత్స్వ) లకి టార్గెట్ అవుతారు? అది ఎందుకు? అసలు డేవిడ్,మేయర్ జార్జ్..లు వెంకట్, రాజు..ల పై ఎందుకు పగబట్టారు? మధ్యలో హీరోయిన్ ఐశ్వర్య మీనన్ పాత్ర ఏంటి?.. వంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ :

‘భజే వాయు వేగం’ కొత్త కథేమీ కాదు. కానీ దాని చుట్టూ అల్లిన స్క్రీన్ ప్లే బాగుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా లాజిక్స్ మిస్ అవుతాయి. సాగదీత కూడా అనిపించొచ్చు. అంతలా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నాడు దర్శకుడు. అయితే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ నుండి సినిమా ఊపందుకుంటుంది. ఇంటర్వెల్ వద్ద వచ్చే ట్విస్ట్ సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది. సెకండాఫ్ పై క్యూరియాసిటీ పెంచే విధంగా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్టింగ్ నుండి క్లైమాక్స్ వరకు చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా స్క్రీన్ ప్లేని పగడ్బంధీగా రాసుకున్నాడు దర్శకుడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఓకే, సినిమాటోగ్రఫీ కూడా రిచ్ గానే ఉంది. నిర్మాతలు కూడా బాగానే ఖర్చు పెట్టారు. ఎటొచ్చీ ప్రమోషన్ బాగా చేసి ఉండాల్సింది. ఓపెనింగ్స్ వీక్ గా ఉండటానికి అదే కారణం.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే..

కార్తికేయ ఈ సినిమాతో తన టాలెంట్..ని మరోసారి నిరూపించుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా తన అనుభవాన్ని చూపించాడు. ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కి ఈ సినిమా రూపంలో చాలా రోజుల తర్వాత మంచి రోల్ దొరికింది. అతని మార్క్ నటనతో మెప్పించే ప్రయత్నం చేశాడు. ‘బొమ్మాళి’ రవిశంకర్ మరోసారి తన విలక్షణ నటనతో మంచి మార్కులు వేయించుకున్నాడు. సుదర్శన్ కూడా బాగానే చేశాడు. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ కి మాత్రం పెద్దగా నటించే స్కోప్ దక్కలేదు. ఆమె పాత్రలో చాలా లాజిక్కులు మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ‘టెంపర్’ వంశీ పాత్రని ముగించిన తీరు ఆకట్టుకోదు. తనికెళ్ళ భరణి, నాగ మహేష్ వంటి వారు ఉన్నంతలో బాగానే నటించారు.

ప్లస్ పాయింట్స్ :

సెకండ్ హాఫ్

స్క్రీన్ ప్లే

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్

మైనస్ పాయింట్స్ :

స్లోగా సాగే ఫస్ట్ హాఫ్
హీరోయిన్ ట్రాక్

మొత్తానికి ‘భజే వాయు వేగం’ ఓ మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. ఇంత ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ఓ సినిమా వచ్చి చాలా కాలమే అయ్యింది. వీకెండ్ మూవీ లవర్స్ ని కచ్చితంగా ఈ మూవీ ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

రేటింగ్ : 2.5/5

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు