Swayambhu : సమ్మర్ కి షిఫ్ట్ అయిపోయిన నిఖిల్ సినిమా..!

Swayambhu : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన నిఖిల్ సిద్దార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిన్న చిన్న సైడ్ రోల్స్ చేస్తూ హీరోగా ఎదిగిన నిఖిల్ కార్తికేయ2 సినిమా తో ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అందుకుని మంచి మార్కెట్ ని సంపాదించుకున్నాడు. ఆ తరువాత నిఖిల్ రెండు సినిమాలు చేయగా వాటితో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు. 18 పేజెస్ సినిమా పర్వాలేదని అనిపించినా, స్పై ప్లాప్ అయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం నిఖిల్ చేస్తున్న రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో రాబోతున్నాయి. అందులో ఒకటి నిఖిల్ హీరోగా భరత్ కృష్ణమాచారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా “స్వయంభు”. భువన్ సాగర్ నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ మూవీగా వస్తుంది. ఈ సినిమాలో నిఖిల్ సరసన మలయాళ భామ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక నిఖిల్ స్వయంభు సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకోగా మిగతా పార్ట్ షూటింగ్ జరగాల్సి ఉంది.

Nikhil Swayambhu movie releasing in 2025 summer

సమ్మర్ కి షిఫ్ట్ అయిన నిఖిల్ సినిమా..

ఇక అసలు విషయానికి వస్తే.. నిఖిల్ స్వయంభు సినిమాను ఈ ఇయర్ ఎండింగ్ కి రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. కానీ షూటింగ్ డిలే వల్ల కుదరక ఇప్పుడు ఆ నిర్ణయం మార్చుకున్నట్టు తెలుస్తుంది. నిఖిల్ స్వయంభు సినిమా ఈ ఇయర్ వదిలేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఈసారి సమ్మర్ స్టార్స్ సినిమాలు రిలీజ్ ప్లాన్ చేయగా ఏది అనుకున్న టైం కు రాలేదు. 2024 సమ్మర్ స్టార్ సినిమాలు లేక చప్పగా సాగిందని చెప్పాలి. అయితే 2025 లో మాత్రం వరుస స్టార్ సినిమాలు టార్గెట్ చేస్తున్నారు. అయితే వారితో తను పోటీకి సిద్ధం అంటున్నాడు నిఖిల్. స్వయంభు తో పాటుగా నిఖిల్ రామ్ చరణ్ నిర్మాణంలో ది ఇండియా హౌస్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది. ఈ సినిమా స్వయంభు (Swayambhu) రిలీజ్ అయ్యాక వచ్చే ఏడాది జూన్ లేదా జులై లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

పాన్ ఇండియా టార్గెట్ గా నిఖిల్ సినిమాలు..

ఇక కార్తికేయ 2 తర్వాత నిఖిల్ చేస్తున్న ఈ రెండు క్రేజీ సినిమాలు కూడా పాన్ ఇండియా రేసులో ఉండనున్నాయి. మరి నిఖిల్ అనుకున్న విధంగా ఈ సినిమాలతో టార్గెట్ రీచ్ అవుతాడా లేదా అన్నది చూడాలి. నిఖిల్ ‘స్వయంభు’, ‘ది ఇండియా హౌస్’ రెండు సినిమాల మీద ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ ఉంది. మరి అందుకు తగినట్టుగానే సినిమాలు ఉంటాయా లేదా అన్నది చూడాలి. ఈ రెండిటితో పాటు తర్వాత నిఖిల్ చేసే తర్వాత సినిమాలు కూడా నేషనల్ వైడ్ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకునే చేయాలనే ఆలోచనతో ఉన్నాడు. కార్తికేయ2 కి వచ్చిన ఇంపాక్ట్ వల్ల ఇలాంటి ప్రత్యేకమైన సినిమాలు చేస్తే పాన్ ఇండియా రేంజ్ లోనే చేయాలనీ డిసైడ్ అయ్యాడు నిఖిల్. బహుశా ముందు ముందు సినిమాల కథా, కథనాలను బట్టి రీజనల్ మూవీస్ కూడా చేయవచ్చు.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు