Keerthy Suresh : అక్కడ కీర్తి డబుల్.. అందుకే హద్దులు దాటి రెచ్చిపోతుందా?

Keerthy Suresh : టాలీవుడ్ లో మహానటి గా కీర్తి సురేష్ ఎంతటి పేరును సంపాదించిందో తెలిసిందే. నేను శైలజ, నేను లోకల్ వంటి చిన్న సినిమాలతో సక్సెస్ ని అందుకున్న కీర్తి “మహానటి” సావిత్రి బయోపిక్ తో ఓ రేంజ్ స్టార్ డమ్ సంపాదించింది. తెలుగులోనే కాదు ఆల్మోస్ట్ సౌత్ మొత్తం కీర్తి సురేష్ నటనకు ఫిదా అయింది. ఇక కీర్తి సురేష్ ఆ సినిమాకు ముందు, ఆ తర్వాత కూడా నటనకు స్కోప్ ఉన్న పాత్రలే చేయడంతో పాటు, గ్లామర్ షో ఉన్న క్యారెక్టర్స్ కి దూరంగా ఉంటూ వచ్చింది. నిజానికి కీర్తి సురేష్ కి ఇంత మంచి పేరు ఉండడానికి యాడ్ కూడా కారణం. పేరుకి మలయాళ భామ అయినా తెలుగు హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అంటే ఇక్కడ కీర్తికి ఎంత ఫాలోయింగ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు. అయితే గత కొన్నాళ్లగా సినిమాలలో గ్లామర్ డోస్ పెంచినట్టు తెలుస్తుంది. ఆ మధ్య సర్కారు వారి పాట, రంగ్ దే వంటి చిత్రాల్లో అవసరం లేకపోయినా గ్లామర్ షో చేయించారు కీర్తి చేత. దాని వల్ల కీర్తి బ్రాండ్ ఇమేజ్ తగ్గింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సినిమాలో నటిస్తుందన్న సంగతి తెలిసిందే. అక్కడ గ్లామర్ హద్దులు చెరిపేసి విపరీతంగా రొమాన్స్ సీన్లకు సై అంటుందట.

Keerthy Suresh is doing glamor show in Bollywood movie

హద్దులు దాటేసిన కీర్తి..

అయితే తాజా సమాచారం ప్రకారం కీర్తి బాలీవుడ్ లో గ్లామర్ షో చేయడానికి డిసైడ్ అయిందట. కేవలం నటిస్తే సరిపోదన్నట్టు గ్లామర్ సైడ్ కూడా మెప్పించాలని నిర్ణయించుకుందట కీర్తి సురేష్. ఈ మధ్య సోషల్ మీడియా లో కూడా గ్లామర్ డోస్ పెంచుతూ కనిపిస్తుంది. ఫోటో షూట్స్ తోనే కాదు రాబోయే సినిమాల్లో కీర్తి సురేష్ బోల్డ్ అటెంప్ట్ చేస్తుందని తెలుస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ లో కీర్తి సురేష్ కి ఛాన్స్ రాగా అందుకు తగినట్టుగా అమ్మడు తెగ కష్టపడుతుందని తెలుస్తుంది. వరుణ్ ధావన్ తో ‘బేబీ జాన్’ సినిమాలో బీ టౌన్ ఛాన్స్ అందుకున్న కీర్తి సురేష్ ఆ సినిమాలో రెచ్చిపోయి నటిస్తుంది. ఆ సినిమా కోసం ఆల్రెడీ లిప్ లాక్ సీన్ కు సై అన్నదని మీడియా లో వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ ని ఎలా కన్విన్స్ చేసి ఈ సీన్స్ కి ఒప్పించారు అన్నది ఎవరికి అర్ధం కాలేదు. హీరోయిన్ గా అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించాలనే ప్రయత్నంలో కీర్తి సురేష్ అందుకు సై అన్నదని చెబుతున్నారు.

- Advertisement -

డబుల్ రెమ్యూనరేషన్.? అందుకే సై..!

అయితే సౌత్ లో ఎప్పుడూ పెద్దగా గ్లామర్ షో చేయని కీర్తి బాలీవుడ్ లో ఎందుకు చేస్తుందని ఆమె ఫాలోవర్లు అంటున్నారు. కానీ కీర్తికి అక్కడి నిర్మాతలు డబుల్ రెమ్యునరేషన్ ఇవ్వడం జరిగిందని, అందుకే గ్లామర్ షో పెంచేసిందని అంటున్నారు నెటిజన్లు. ఇక కీర్తి సురేష్ సౌత్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అనిపించుకున్నా కూడా ఆమెకు ఇక్కడ 3 నుంచి 4 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇచ్చారు. అయితే బాలీవుడ్ లో ఆఫర్ రాగానే కీర్తి సురేష్ (Keerthy Suresh) ఆలోచించిందట.. ఇక కీర్తి కి మేకర్స్ రెమ్యునరేషన్ డబుల్ ఆఫర్ చేయడంతో కాదనలేకపోయిందని టాక్. బేబీ జాన్ కోసం కీర్తి సురేష్ 6 నుంచి 8 కోట్ల దాకా పారితోషికం అందుకుందని, అందుకే ఆ సినిమా కోసం డైరెక్టర్ ఎలా అడిగితే అలా రెచ్చిపోయిందని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉంది అన్నది తెలియదు, కానీ కీర్తి సురేష్ ని సౌత్ సినిమాల్లో చూసి ఇష్టపడిన ఆమె ఫ్యాన్స్ మహానటి ముద్దులతో రెచ్చిపోవడం చూసి తట్టుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇక తెలుగులో కీర్తి సురేష్ దసరా తర్వాత మళ్ళీ సినిమా చేయలేదు. కానీ కల్కి2898AD లో బుజ్జి కార్ పాత్రకు డబ్బింగ్ చెప్తుంది. త్వరలోనే రామ్ చరణ్ RC17 లో అలాగే, ఓ మీడియం రేంజ్ హీరో సినిమాలో కూడా సినిమా ఛాన్స్ అందుకునే అవకాశం ఉందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు