Kalki2898AD : ఈ నటుల్ని డైరెక్ట్ తెరపైనే చూస్తారట! ఎందుకంటే?

Kalki2898AD : టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లలో తెరకెక్కుతున్న సినిమా కల్కి2898AD. ఈ సినిమా ని పాన్ ఇండియా రేంజ్ లో కాకుండా ఏకంగా 22 భాషల్లో పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ మైథలాజికల్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని స్వప్న దత్, ప్రియాంక దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీమహావిష్ణు 10వ అవతారం అయిన కల్కి పాత్రలో కనిపిస్తున్నాడు. అలాగే భైరవ అనే మరో రోల్ లో కూడా నటించాడు. ఇక బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ ఈ చిత్రంలో అశ్వద్ధామ పాత్ర చేశారు. కమల్ హాసన్ ప్రతినాయకుడిగా కనిపిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ హీరోయిన్స్ ప్రభాస్ కి జోడీగా నటించారు. ఇక ఆల్మోస్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసకోగా, ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా వుంది.

Nani and Dulquer Salmaan are making guest appearances in Kalki2898AD

భారీ ఎత్తున వరల్డ్ వైడ్ రిలీజ్ కి ప్లాన్..!

ఇక కల్కి2898AD సినిమా ఖచ్చితంగా థియేటర్లలో వండర్స్ క్రియేట్ చేస్తుందని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఏకంగా 22 భాషలలో ఈ చిత్రం రిలీజ్ అవుతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వగా, ప్రస్తుతానికి ఎన్ని భాషల్లో ఒక్కసారిగా రిలీజ్ అవుతుందో తెలీదు. అయితే ఇండియాలోనే ఈ సినిమాను ఏకంగా ఎనిమిది వేల స్క్రీన్ లలో ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయ్. ఆల్రెడీ రెండు వారాల నుండే ప్రమోషన్లు స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ త్వరలో సాంగ్స్ కూడా రిలీజ్ చేసి సినిమా బజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లబోతున్నారు. జపాన్, చైనా, రష్యా వంటి దేశాల్లో ఈ సినిమాను స్పెషల్ గా ప్రమోట్ చేస్తారట. కానీ అది ఎప్పుడో ఎలాగో లెక్కలు తెలియదు గాని, ఇండియాలో మాత్రం ప్రతి సిటీలోనూ చిత్ర యూనిట్ సందడి చేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ బడా స్టార్స్ భాగం అయ్యారు. అయితే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

- Advertisement -

ఆ హీరోలందర్నీ తెరపైనే చూడాలట..

ఇక కల్కి 2898AD (Kalki2898AD) లో గెస్ట్ రోల్స్ లో టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలా మంది నటిస్తున్నారట. అలాగే కోలీవుడ్, మాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో ఉన్నారని సమచారం. నాగ్ అశ్విన్ మహానటి సినిమా కోసం టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ ని, డైరెక్టర్స్ ని కీలక పాత్రల కోసం ఉపయోగించుకున్నాడు. అలాగే కల్కి 2898AD సినిమాలో కూడా కీలక పాత్రల కోసం నేచురల్ స్టార్ నాని, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి స్టార్స్ ని దించుతున్నారట. వీరితో పాటు మరికొంత మంది స్టార్ యాక్టర్స్ కూడా మూవీలో గెస్ట్ రోల్స్ లో కనిపించబోతున్నారంట. అయితే వారు ఎవరనేది డైరెక్ట్ గా స్క్రీన్ పైనే రివీల్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాక్. ఇక నాగ్ అశ్విన్ టేకింగ్ టాలెంట్ గురించి చాలా మందికి తెలుసు. ఈ కారణంగానే అతను అడిగిన వెంటనే చేయడానికి ఒకే చెప్పినట్లు ప్రచారం నడుస్తోంది. అయితే త్వరలో ట్రైలర్, ఇతర ప్రమోషనల్ వీడియోలు రిలీజ్ చేయనుండగా, ఆ వీడియోల్లో కూడా ఈ స్టార్ నటులను రివీల్ చేసే ప్రసక్తి లేదని వాళ్ళని థియేటర్లో చూసే థ్రిల్ అవ్వాలని భావిస్తునట్టు చిత్ర యూనిట్ సమాచారం. మరి వాళ్ళందర్నీ తెరపై ఒకేసారి చూపిస్తారో, లేదా విడివిడిగా వేరే క్యారెక్టర్లలో చూపిస్తారో తెలియాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు