HBD Nikhil : ‘కష్టేఫలి’ కి నిర్వచనం.. ‘నిఖిల్ సిద్ధార్థ్’ సినీ ప్రయాణం..

HBD Nikhil : నిఖిల్ సిద్ధార్థ్.. టాలీవడ్ లో టాలెంటెడ్ యంగ్ హీరోల్లో ఒకడు. క్యాజువల్ గా పక్కింటి కుర్రాడిలా ఉండే ఈ హీరో తనదైన డిఫరెంట్ పెర్ఫార్మన్స్ తో చక్కని నటనా, అభినయంతో ముందుకు సాగుతున్నాడు. టాలీవుడ్ లో సైడ్ హీరో రోల్స్ చేసే స్థాయి నుండి నేడు పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. కెరీర్ మొదట్లో రొటీన్ స్క్రిప్ట్ లతో అంతగా రానించలేని నిఖిల్, కొన్నేళ్లలో తనను తాను మార్చుకుని ప్రేక్షకులకు నచ్చే విధంగా సరికొత్త స్క్రిప్ట్ లతో, కథా, కథనాలతో ఆడియన్స్ ని అలరిస్తూ దూసుకుపోతున్నాడు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ కొట్టిన నిఖిల్, ఇప్పుడు మళ్ళీ పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. వరుస హిట్లతో చిన్న హీరోనుండి మీడియం రేంజ్ హీరోదాకా ఎదిగిన నిఖిల్ నవతరం హీరోలకు ప్రతినిధిగా రాబోయే హీరోలకు ఇన్స్పైర్ అవుతున్నాడు. ఈ రోజు నిఖిల్ సిద్ధార్థ్ (జూన్1) పుట్టినరోజు. ఈ సందర్బంగా తనకు బర్త్ డే విషెస్ (HBD Nikhil) ని తెలియచేస్తూ, నిఖిల్ ఫిల్మ్ జర్నీ పై ఓ లుక్కేద్దాం.

HBD Nikhil Siddharth Birth day Special story

సైడ్ హీరో నుండి పాన్ ఇండియా రేంజ్ సినిమాలు చేసే స్థాయికి..

హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన నిఖిల్ సిద్ధార్థ్ తాను బిటెక్ చదువుతున్న రోజులనుండే సినిమాలపై ఫ్యాషన్ తో ఫోకస్ పెట్టాడు. ఇరవై ఏళ్ళ కిందే ‘హైదరాబాద్ నవాబ్స్’ అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. తరువాత కొన్ని చిత్రాల్లో బిట్ రోల్స్ లోనూ కనిపించాడు. ఇక శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’ లో రాజేశ్ పాత్రలో నలుగురు హీరోల్లో ఒకడిగా నటించి ఆకట్టుకున్నాడు నిఖిల్. ఇక నిఖిల్ సోలో హీరోగా రూపొందిన ‘యువత’ మంచి సక్సెస్ సాధించగా, ఆలస్యం అమృతం, వీడు తేడా వంటి సినిమాలతో అలరించాడు. అయితే నిఖిల్ కి ఫస్ట్ సాలిడ్ బ్రేక్ ఇచ్చింది అంటే “స్వామి రారా” సినిమా. ఈ సినిమాలో ఒక దొంగగా నటించాడు నిఖిల్. ఇక్కడి నుండి డిఫరెంట్ సినిమాలు చేస్తూ వచ్చాడు నిఖిల్. కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం” వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. ఇక నిఖిల్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’ పాన్ ఇండియా వైడ్ గా నేత సక్సెస్ సాధించిందో తెలిసిందే. ఈ సినిమా తర్వాత నిఖిల్ పాన్ ఇండియా సినిమాలు చేయటం స్టార్ట్ చేసాడు.

- Advertisement -

పాన్ ఇండియా సినిమాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకి…

ఇక ఇంతవరకు రావడానికి ఇండస్ట్రీ లో ఎంతో కష్టపడ్డ నిఖిల్ కెరీర్ ఎండ్ అయ్యే స్టేజ్.. నుంచి పాన్ ఇండియా సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. నిజం చెప్పాలంటే ఇప్పుడు నిఖిల్ నుంచి సినిమా వస్తుంది అనగానే అది మినిమం బాగుంటుంది అనే నమ్మకం మూవీ లవర్స్ కి ఉంది. దీన్ని ప్రతి సినిమాతో నిలబెట్టుకుంటూ వస్తున్న నిఖిల్, రాబోయే పాన్ ఇండియా సినిమాలతో అలరించడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం “స్వయంభు” అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు నిఖిల్. ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్నాడు. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి, అభిషేక్ అగర్వాల్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ‘ది ఇండియా హౌస్ ’ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది. ఈ రెండు సినిమాలతో నిఖిల్ తన మార్కెట్ ని మరింత పెంచుకోబోతున్నాడు అని చెప్పాలి. మరి మున్ముందు నిఖిల్ ఇలాంటి క్రేజీ సినిమాలు మరిన్ని చేయాలనీ కోరుకుంటూ తనకు ఫిల్మిఫై తరపున బర్త్ డే విషెస్ ని అందచేస్తున్నాం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు