Maname Trailr Launch By Ram Charan: స్నేహం కోసం AAA సినిమాస్ కి వరకు

Maname Trailr Launch By Ram Charan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్లో శర్వా నంద్ ఒకరు. ఐదో తారీకు శంకర్ దాదా ఎంబిబిఎస్ గౌరీ వంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో కనిపించాడు శర్వా. ఆ తర్వాత యువసేన అనే సినిమా లీడ్ రోల్ లో కనిపించాడు. ఒక హీరోగా శర్వానంద్ కు మంచి సక్సెస్ తీసుకొచ్చిన సినిమా గమ్యం. ఈ సినిమాతో క్రిష్ దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా మళ్లీ మంచి పేరు తీసుకొచ్చిన సినిమా అంటే దేవకట్ట దర్శకత్వంలో వచ్చిన ప్రస్థానం. ఈ సినిమాతోనే సర్వానంద్ కి మంచి గుర్తింపు దక్కింది. సుజిత్ దర్శకత్వంలో వచ్చిన రన్ రాజా రన్ సినిమాతో కమర్షియల్ హిట్ అందుకున్నాడు శర్వా. ఆ తర్వాత వచ్చిన మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా కూడా డీసెంట్ హీట్ అయింది.

ఒకే ఒక జీవితం సినిమాతో మళ్ళీ హిట్

శర్వానంద్ కెరీర్లో హిట్ సినిమాలు కంటే కూడా ప్లాప్ సినిమాలో ఎక్కువ ఉన్నా యని చెప్పొచ్చు. చాలా ఎక్స్పరిమెంటల్ ఫిలిమ్స్ చేస్తూ డిజాస్టర్ ను చూస్తూ ఉంటాడు శర్వానంద్. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద శర్వానంద్ సినిమాలు ఫెయిల్ అయినా కూడా ఒక హీరోగా సర్వానంద్ ఫెయిల్ కాదు 100% ఎఫర్ట్ అందిస్తాడు. శర్వానంద్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పొచ్చు. ఇకపోతే కొన్ని సినిమాలు తర్వాత ఒకే ఒక జీవితం అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే అనే సినిమాను చేస్తున్నాడు శర్వానంద్. ఈ సినిమాలో శర్వానంద్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

Maname Trailer Launch By Ram Charan: For Friendship
Maname Trailer Launch By Ram Charan: For Friendship

స్నేహం కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

మనమే సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన పాట కూడా విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను జూన్ ఏడున రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది చిత్ర యూనిట్. ఈ తరుణంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదగా ట్రైలర్ను రిలీజ్ చేయనున్నారు. ఈ ట్రైలర్ ను ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు అనుకున్నారంతా, కానీ ఈ ట్రైలర్ లాంచ్ కి రామ్ చరణ్ అమీర్ పేట్ లో AAA సినిమాస్ కి రానున్నారు. ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో శర్వానంద్ కి ఉన్న అతి తక్కువ మంది ఫ్రెండ్స్ లో రానా మరియు రాంచరణ్. రామ్ చరణ్ కి శర్వానంద్ కి మధ్య మంచి బాండింగ్ ఉంది. అలానే చిరంజీవి గారితో కూడా శర్వానంద్ కి మంచి అనుబంధం ఉంది. ఇక శర్వానంద్ విషయానికి వస్తే కేవలం తెరపైన మాత్రమే కాకుండా తెర వెనుక కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు. ఒక ఈవెంట్ లో అభిమాని వచ్చి కాళ్ల మీద పడితే వెళ్లి మీ తల్లిదండ్రుల కాళ్ళ మీద పడండి అంటూ కొన్ని మంచి మాటలు చెప్పాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా శర్వానంద్ మీద ఇంకొంచెం గౌరవాన్ని తీసుకొచ్చి పెట్టాయి అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు