HBD Tom Holland : స్పైడర్ మ్యాన్ బర్త్ డే స్పెషల్… ఏ సిరీస్ ఎన్ని కోట్లు కొల్లగొట్టింది అంటే?

HBD Tom Holland : ఎనిమిదేళ్ళ క్రితం మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రం ‘కెప్టెన్ అమెరికా: సివిల్ వార్’లో 20 ఏళ్ల స్పైడర్ మ్యాన్‌ను చూశారు మూవీ లవర్స్. ఒక చిన్న కుర్రాడు సినిమాలో పాపులర్ సూపర్ హీరోల మధ్య అద్భుతమైన విన్యాసాలు చేస్తూ కనిపించాడు. ప్రఖ్యాత సూపర్ హీరో స్పైడర్‌మ్యాన్ ఈ కొత్త ముఖాన్ని ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడ్డారు. ఇప్పుడు మనం మార్వెల్ ప్రపంచంలోని ప్రసిద్ధ నటుడు టామ్ హాలండ్ గురించి మాట్లాడుతున్నాము. మొదటిసారి మల్టీస్టారర్ చిత్రంలో కనిపించిన టామ్ 2019 సంవత్సరంలో ‘స్పైడర్‌మ్యాన్-ఫార్ ఫ్రమ్ హోమ్’ చిత్రంలో మెయిన్ లీడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2016లో మొదలైన టామ్ స్పైడర్ ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ప్రముఖ హాలీవుడ్ రచయిత, హాస్యనటుడు డొమినిక్ హాలండ్ కుమారుడు టామ్ కీర్తి స్పైడర్ మ్యాన్ తో ఇంటర్నేషనల్ రేంజ్ లోకి మారింది. భారతదేశంలో కూడా టామ్ అభిమానుల సంఖ్య భారీగానే ఉంది. ఈరోజు అందరి అభిమాన స్పైడర్‌మ్యాన్ తన 28వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఇప్పటిదాకా స్పైడర్ మ్యాన్ సిరీస్ లో వచ్చిన సినిమాల కలెక్షన్స్ పై ఓ లుక్కేద్దాం.

స్పైడర్ మ్యాన్ సిరీస్ లు – కలెక్షన్స్

2002లో స్పైడర్‌ మ్యాన్‌ మూవీ 82,17,06,375 వసూళ్లు కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. 2004లో స్పైడర్‌ మ్యాన్‌-2 79,46,97,557 డాలర్లు, 2007లో స్పైడర్‌ మ్యాన్‌-3 సినిమా 89,48,60,230 డాలర్లు కొల్లగొట్టాయి.

Tom Holland says he will only return as Spider-Man under one condition

- Advertisement -

2012లో ది అమేజింగ్‌ స్పైడర్‌ మ్యాన్‌ 75,78,90,267 డాలర్లు, 2014లో ది అమేజింగ్‌ స్పైడర్‌ మ్యాన్‌-2 సినిమా 70,89,96,336 డాలర్లు, 2017 హోమ్‌ కమింగ్‌ 87,83,46,440 డాలర్లు, 2018లో ఇన్‌ టు స్పైడర్‌ వర్స్ మూవీ 37,56,54,619 డాలర్ల వసూళ్లను రాబట్టాయి. 2019లో విడుదలైన స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్‌ హోమ్‌ 113,25,32,832 డాలర్లు, 2021 లో వచ్చిన స్పైడర్ మ్యాన్: నో వే హోం సినిమా 1 బిలియన్ డాలర్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. 2023లో స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్ వెర్స్ 690 మిలియన్లకు పైగా వసూలు చేసింది.

నెక్స్ట్ పార్ట్ రిలీజ్ ఎప్పుడంటే?

యానిమేటెడ్ స్పైడర్-మ్యాన్ కథ రాబోయే మూడవ చిత్రం బియాండ్ ది స్పైడర్-వెర్స్‌తో ముగుస్తుంది. జూన్ 2023లో రిలీజైన ఇన్‌ టు ది స్పైడర్-వెర్స్ సీక్వెల్ ఎక్రాస్ ది స్పైడర్-వెర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు త్రీక్వెల్ స్పైడర్ మ్యాన్: బియాండ్ ది స్పైడర్-వెర్స్ రిలీజ్ కోసం స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. స్పైడర్ మ్యాన్: బియాండ్ ది స్పైడర్-వెర్స్ వాస్తవానికి 2024 మార్చి 29న విడుదల కావాల్సి ఉంది. అయితే 2023 చివరిలో హాలీవుడ్ సమ్మెల కారణంగా ఈ మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఫిల్మ్ మేకింగ్ త్రయం జోక్విమ్ డాస్ శాంటోస్, కెంప్ పవర్స్, జస్టిన్ కె. థాంప్సన్ ఈ పార్ట్ కి కూడా మళ్లీ దర్శకత్వ బాధ్యతలను పంచుకుంటున్నారు. షమీక్ మూర్ మరోసారి మోరల్స్‌గా కన్పించబోతున్నాడు. అయితే ఈ త్రీక్వెల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు