Manamey Trailer : మనమే ట్రైలర్ టాక్ , శర్వా సేఫ్ గేమ్

Manamey trailer talk: ముందుగా కొన్ని షార్ట్ ఫిలిం చేసి, కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించి, 2015 లో రిలీజ్ అయిన భలే మంచి రోజు అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు శ్రీరామ్ ఆదిత్య. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. 70mm బ్యానర్స్ ఈ సినిమాను నిర్మించింది ఈ సినిమాలో సుధీర్ బాబు వామిక జంటగా నటించారు ఈ సినిమా దర్శకుడుగా మంచి అవకాశాలను అందుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. భలే మంచి రోజు సినిమా తర్వాత సమంతకమని అనే సినిమాను చేశాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు,నారా రోహిత్,సందీప్ కిషన్, ఆది సాయికుమార్ కీలకపాత్రలో కనిపించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఘనవిజయాన్ని సాధించింది.

శమంతకమని సినిమాతో మల్టీ స్టారర్

శమంతకమని సినిమా తర్వాత వైజయంతి బ్యానర్లో సినిమాను చేసే అవకాశం పొందుకున్నాడు నాని నాగార్జున కీలక పాత్రలో నటించిన సినిమా దేవదాస్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించుకోలేదు. సినిమా ఒక రకంగా బాగానే ఉన్నా కూడా దీనికి సరైన స్పందన లభించలేదు. ఈ సినిమా తర్వాత హీరో అనే సినిమాను చేశాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అని ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించి కాసులు వర్షం కురిపించింది.

ఇక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా మనమే అనే సినిమాను తీశాడు శ్రీరామ ఆదిత్య.  ఈ సినిమా జూన్ 7 న  రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో ఈ సినిమా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ సినిమా పైన ఆసక్తి పెంచుతుంది. రీసెంట్ టైమ్స్ లో శర్వానంద్ సినిమాలు అంతగా వర్కౌట్ కావడం లేదు. విభిన్నమైన కథలను ఎన్నుకున్న కూడా బాక్సాఫీస్ వద్ద వాటికి సరైన స్పందన రావడం లేదు అనేది వాస్తవం. చివరగా చేసిన ఒకే ఒక జీవితం సినిమా పరవాలేదు అనిపించుకుంది.

- Advertisement -

Manamey

మనమే సినిమా ట్రైలర్ టాక్

ఇక మనమే ట్రైలర్ విషయానికి వస్తే, ఈ ట్రైలర్ బాగానే ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. శర్వానంద్ లో ఉన్న కామెడీ టైమింగ్ను మరొకసారి బయటికి తీసాడు శ్రీరామ్ ఆదిత్య. శర్వానంద్ కృతి శెట్టి మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది అనిపిస్తుంది. శర్వానందులో కామెడీ టైమింగ్ చూసి చాలా రోజులైంది. ఈ సినిమాలో వర్కౌట్ అయితే సినిమా బాగా ఆడుతుందని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమాలో ఒక బేబీ కూడా కనిపిస్తుంది ఈ సినిమాకి ఈ బేబీ కీలకము కానున్నట్లు తెలుస్తోంది. సినిమా టైటిల్ లో కూడా బేబీ కనిపించేటట్లు డిజైన్ చేశారు. ఈ సినిమాకి అబ్దుల్ సంగీతం అందిస్తున్నారు. హృదయం సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకున్న అబ్దుల్ తెలుగులో ఖుషి, హాయ్ నాన్న ఇప్పుడు మనమే సినిమాతో మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేయనున్నాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు