Shubman Gill Marriage : టీవీ నటితో టీం ఇండియా క్రికెటర్ మ్యారేజ్… క్లారిటీ ఇచ్చిన నటి

Shubman Gill Marriage : టీం ఇండియా క్రికెటర్ శుభమాన్ గిల్‌ని పెళ్లి చేసుకోబోతుందంటూ వస్తున్న రూమర్లపై స్పందించింది టీవీ నటి రిధిమా పండిట్. స్టార్ క్రికెటర్‌ని 2024 డిసెంబర్‌లో రిధిమా వివాహం చేసుకుంటారని పెళ్లి పుకార్లు వైరల్ కావడంపై ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. గిల్ తో పెళ్లి వార్తలపై రిధిమా ఎలా రియాక్ట్ అయ్యిందో చూద్దాం.

నాకు కూడా ఇప్పుడే తెలిసింది..

గిల్ తో పెళ్లి పుకార్లపై రిధిమా మాట్లాడుతూ తాను పెళ్లి చేసుకునే ఆలోచన లేనని స్పష్టం చేసింది. “నా వివాహం గురించి జర్నలిస్టుల నుండి చాలా కాల్స్ రావడంతో ఈరోజు నేను మేల్కొన్నాను. కానీ ఏ పెళ్లి? ఎవరి పెళ్లి ? నా పెళ్లి అనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది. నేను పెళ్లి చేసుకోవడం లేదు. నా జీవితంలో ఇలాంటి ముఖ్యమైన కార్యం జరిగితే నేనే బయటకు వచ్చి ఆ వార్తను ప్రకటిస్తాను. ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదు” అంటూ క్లారిటీ ఇచ్చింది.

పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్

ప్రస్తుతం వైరల్ అవుతున్న వార్తల ప్రకారం గిల్, రిధిమా పెళ్లి ముహూర్తాన్ని కూడా ఖరారు చేశారు. ఈ జంట వివాహం డిసెంబర్ 2024లో రాజస్థాన్‌లోని జైపూర్‌లో పెళ్లి చేసుకుంటారని, గిల్, రిధిమా తమ వివాహాన్ని ప్రైవేట్‌గా ఉంచాలని భావించారని అన్నారు. అంతేకాదు పెళ్లిళ్లలో ఫోన్‌లు లేదా మీడియా కవరేజీకి అనుమతి ఉండదని గాలి వార్తలు బాగానే విన్పించాయి.

- Advertisement -

Ridhima Pandit To Marry Cricketer Shubman Gill In December? Actress Says 'This Is Happening...'

గాసిప్ ఎలా వచ్చిందంటే?

రిధిమా ఈ విషయం గురించి మాట్లాడుతూ “ఈ వార్తలు కొంతమంది ఊహ మాత్రమే అని నేను అనుకుంటున్నాను. ఎవరో ఒక కథను సృష్టించారు. ఆపై అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నాకు వ్యక్తిగతంగా శుభమాన్ గిల్ తెలియదు. ఇది హాస్యాస్పదంగా ఉంది. నేను ఈ రోజు ఉదయం లేవగానే అభినందిస్తూ మెసేజ్ లు వచ్చాయి. దీంతో ఈ గాసిప్‌ను తిరస్కరించడంలో నేను విసిగిపోయాను. అందుకే చివరకు నా సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను” అంటూ రూమర్ ఎలా వచ్చిందో క్లారిటీ ఇచ్చింది.

రిధిమా రిలేషన్ షిప్ స్టేటస్

తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి మరింత అడిగినప్పుడు రిధిమా “నేను ఒంటరిగా ఉన్నాను. కానీ ఈ పుకార్ల కారణంగా నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకునే వారు ఇప్పుడు ముందుకు రారు. నేను పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటున్నాను” అని నవ్వుతూ క్లారిటీ ఇచ్చింది.

గిల్ ప్రేమకథ వేరే

పెళ్లి రూమర్లపై శుభమాన్ గిల్ ఇంకా స్పందించలేదు. గతంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌తో ఆయన డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి.

రిధిమా ఎవరు?

రిధిమా 8 ఏళ్లుగా టెలివిజన్ రంగంలో రాణిస్తోంది. ఆమె 2021లో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1లో కనిపించింది. 2019లో ఫియర్ ఫ్యాక్టర్ : ఖత్రోన్ కే ఖిలాడీ 9లో రెండవ స్థానంలో నిలిచింది. వెబ్ సిరీస్ హమ్: ఐయామ్ బిస్యూస్ ఆఫ్ అస్‌లో కూడా నటించింది. రిధిమా ఇటీవల నిర్మాత శుభ్ షగున్ తనను వేధించాడని ఆరోపించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు