Ram Gopal Varma: ఎట్టకేలకు శ్రీదేవితో కోరిక తీర్చుకున్న వర్మ.. వీడియో వైరల్..!

Ram Gopal Varma.. ప్రముఖ స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు శివ, క్షణక్షణం వంటి సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకుని అప్పట్లో ట్రెండ్ సెట్టర్ చేసిన విషయం తెలిసింది. లవ్ , మాస్ చిత్రాలతోనే కాదు రక్త చరిత్ర వంటి యాక్షన్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరించిన రాంగోపాల్ వర్మ కి దివంగత నటి శ్రీదేవి అంటే చచ్చేంత ఇష్టం.. ఆమెతో సినిమా తీయాలని ఎన్నో కలలు కూడా కన్నారు.. అందులో భాగంగానే క్షణక్షణం , గోవిందా గోవిందా సినిమా తీసి తన కోరికను నెరవేర్చుకున్నారు.. కానీ ఆమెను వివాహం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా అది జరగలేదు.

ఎట్టకేలకు కల నెరవేర్చుకున్న వర్మ..

Ram Gopal Varma: Finally, Varma fulfills his wish with Sridevi.. Video goes viral..!
Ram Gopal Varma: Finally, Varma fulfills his wish with Sridevi.. Video goes viral..!

మరొకవైపు ఆమెతో కలిపి ఒక్క స్టెప్ అయినా వేయాలి అని ఎన్నో కలలు కన్నారట ..కానీ అది జరగలేదు. ఆ తర్వాత ఆమె మరణించింది.. ఇక శాశ్వతంగా తన కలను నెరవేర్చుకోలేకపోయారు రాంగోపాల్ వర్మ.. కాని తాజాగా తన కల నెరవేరింది అంటూ ఒక వీడియో షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.. అసలు చనిపోయిన ఆవిడతో తన కల ఎలా నెరవేర్చుకున్నారు అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. మరి రాంగోపాల్ వర్మ ఏ విధంగా తన కోరికను నెరవేర్చుకున్నారు అనే విషయం ఇప్పుడు చూద్దాం.

జామురాతిరి. జాబిలమ్మ.. జోల పాడనా.. ఇలా..

అసలు విషయంలోకి వెళితే.. రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాలలో క్షణక్షణం కూడా ఒకటి.. 1991లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా, శ్రీదేవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి అప్పట్లో అనూహ్య స్పందన లభించింది. మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి అందించిన స్వరాలు ఇప్పటికే శ్రోతలను అలరిస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని “జామురాతిరి. జాబిలమ్మ.. జోల పాడనా.. ఇలా… “సాంగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎక్కడ ఎప్పుడు ఈ పాట విన్నా సరే మనసుకు ప్రశాంతత కలుగుతుంది.. అప్పటి వరకు గొడవ పడుతూ శత్రువులుగా కనిపించిన హీరో, హీరోయిన్స్ అనుకోకుండా అడవిలో రాత్రిపూట చిక్కుకోవడం.. అదే సమయంలో ఇద్దరి మధ్య స్నేహం కుదరడం.. హీరోయిన్ నిద్రపోవడానికి హీరో పాడే జోల పాటే ఇది.. ఈ పాటలో వెంకటేష్, శ్రీదేవి కనిపించిన విషయం తెలిసిందే..

- Advertisement -

ఏ ఐ టెక్నాలజీతో వర్మ కల సాధ్యం..

ఇక ఈ పాట వినడానికే కాదు చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇదే పాటలో వెంకటేష్ స్థానంలో శ్రీదేవి పక్కన వర్మ ఉంటే ఎలా ఉంటుంది.. ఇప్పుడు అదే విషయాన్ని ఏ ఐ టెక్నాలజీ సహాయంతో చేసి చూపించారు వర్మ అభిమానులు.. ఈ పాటలో వెంకీ స్థానంలో వర్మ కనిపించే విధంగా ఏ ఐ టెక్నాలజీ తో వీడియోని క్రియేట్ చేశారు.. ప్రస్తుతం ఈ వీడియోని సోషల్ మీడియాలో వదలగా ఇది బాగా వైరల్ అవుతోంది. అదే వీడియోని వర్మ కూడా తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతూ ఉండగా అభిమానులు కూడా క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే రాంగోపాల్ వర్మ శ్రీదేవికి ఒక పెద్ద అభిమాని.. ఆయన దర్శకత్వంలో క్షణక్షణం గోవింద చిత్రాలలో ఈమె హీరోయిన్ గా నటించింది.. అయితే రెండూ కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు