Manamey: మనమే సినిమాలో 16 పాటలు

Manamey: శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా చేస్తున్న సినిమా మనమే. మనమే జూన్ ఏడున ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ ను కూడా లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రీసెంట్ టైమ్స్ లో ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే విధంగా సినిమాలు లేవు అనుకున్న తరుణంలో ఈ సినిమా అలాంటిది అనే వైబ్స్ కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే సినిమాలు కూడా రావడం తగ్గిపోయాయి. సినీ ప్రేమికులు సినిమాలు లేక ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలోనే మనమే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

హృదయం సినిమాతో తెలుగు ప్రేక్షకులలో కూడా గుర్తింపు

ఇక ఈ ట్రైలర్ విషయానికి వస్తే శర్వానంద్ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. కృతి శెట్టి శర్వానంద్ కి మధ్య మంచి బాండింగ్ కనిపిస్తుంది. ఈ సినిమాలు శ్రీరామ్ ఆదిత్య కుమారుడు విక్రమ్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ ట్రైలర్లు విక్రమ్ ను రిలీజ్ చేశారు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య. ఈ సినిమాలో విక్రమ్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శర్వానంద్ కెరీర్ లో వస్తున్న 35వ సినిమా ఇది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి హృదయం ఫేమ్ “హేషం అబ్దుల్ వహాబ్” సంగీతం అందిస్తున్నాడు.

16 songs in the movie Manamey

- Advertisement -

సినిమాలో మొత్తం 16 పాటలు

మలయాళం లో రిలీజ్ అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా చాలామంది చూసి ఎంజాయ్ చేశారు. భాషతో సంబంధం లేకుండా భావోద్వేగానికి గురై ఈ సినిమాను బాగా ఓన్ చేసుకున్నారు. ఈ సినిమాకి సంగీతం కీలకపాత్ర వహించింది. సినిమా తర్వాతే శివ నిర్వాణ ఖుషి సినిమాకు ఈ సంగీత దర్శకుడుని ఎంచుకున్నారు. ఖుషి సినిమా పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత శౌర్యవ్ దర్శకత్వంలో వచ్చిన హాయ్ నాన్న సినిమాకి కూడా ఇదే సంగీత దర్శకుని ఎంచుకున్నారు. ఈ సినిమా కూడా అద్భుతమైన ఆల్బమ్ ను అందించాడు అబ్దుల్.
ప్రస్తుతం మనమే సినిమాకి కూడా అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మొత్తం 16 పాటలున్నట్లు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ప్రెస్ మీట్ లో రివిల్ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు