Salman Khan: సల్మాన్ ఖాన్ పై హత్యకు కుట్ర.. పాకిస్థాన్ నుంచి ఆయుధాలు..!

Salman Khan.. బాలీవుడ్ కండల వీరుడుగా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ నిత్యం ఆపదలో ఉన్నారు అంటూ ఏదో ఒక వార్త తెరపైకి వస్తూనే ఉంటుంది.. అయితే ఈసారి కూడా ఆయనపై మరో కుట్రకు పన్నాగం పన్నగా పోలీసులు ఆ కుట్రను విఫలం చేశారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ పై హత్యకు పాల్పడిన నలుగురిని నవీ ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఇక అరెస్టు అయిన నలుగురు నిందితులు కూడా లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులే కావడం గమనార్హం. పన్వేల్ లో సల్మాన్ ఖాన్ కారుపై దాడి చేసేందుకు నిందితులు ప్లాన్ చేశారని ..నవి ముంబై పోలీసులు తెలిపారు.. అయితే ఇక్కడ ఆయన కారును విధ్వంసం చేసేందుకు ఏకంగా పాకిస్థాన్ కి చెందిన ఒక సరఫరా దారుడి నుంచి ఆయుధాలను సేకరించేందుకు కూడా కుట్ర పన్నారట.

అరెస్ట్ అయిన నిందితులు..

Salman Khan: Conspiracy to kill Salman Khan.. Weapons from Pakistan..!
Salman Khan: Conspiracy to kill Salman Khan.. Weapons from Pakistan..!

ఈ కేసులో లారెన్స్ బిష్ణోయ్, అన్మోల్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, సంపత్ నెహ్రతో పాటు మొత్తం 17 మందిపై పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇక తాజాగా అరెస్టు చేసిన నలుగురిలో ధనుంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్, గౌరవ్ బాటియా అలియాస్ నహ్వీ, వాస్పీ ఖాన్ అలియాస్ వసీం చిక్నా , రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్ ఖాన్లుగా గుర్తించారు .

కారును ధ్వంసం చేయడానికి భారీ కుట్ర..

అయితే సల్మాన్ ఖాన్ ను ఆయన కారు తో సహా ధ్వంసం చేయడానికి నిందితులు ఆయన ఫామ్ హౌస్ తో పాటు పలుచోట్ల రెక్కీ కూడా నిర్వహించినట్లు కొన్ని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.. ఈ వ్యక్తులు సల్మాన్ ఖాన్ పై ఏకంగా ఏకే 47 గన్ తో కాల్పులు జరపాలని ఆదేశాలు కూడా అందుకున్నారట. నిందితుల మొబైల్ ఫోన్ల నుండి అనేక ఇతర వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎం – 16 , ఏకే – 47, ఏకే – 92లను కొనుగోలు చేసేందుకు పాకిస్తాన్ లో డోగా అనే వ్యక్తితో అజయ్ కశ్యప్ సంప్రదింపులు జరిపినట్లు విచారణలో నిందితులు వెల్లడించినట్లు సమాచారం.

- Advertisement -

గతంలో కూడా కాల్పులు..

ఇదిలా ఉండగా అంతకుముందు ఏప్రిల్ 14న కూడా బాంద్రాలోని సల్మాన్ ఖాన్ గెలాక్సీ అపార్ట్మెంట్ ముందు ఉదయం ఐదు గంటలకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. రెండు బైకులపై వచ్చిన దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. అయితే ఆ కాల్పులు జరిగిన సమయంలో కూడా సల్మాన్ ఖాన్ ఇంట్లోనే ఉన్నాడు. ఈ ఘటన తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటిముందు భద్రతను పెంచిన విషయం తెలిసిందే. రెండు రోజుల తర్వాత కాల్పులు జరిపిన నిందితులిద్దరినీ కూడా పోలీసులు అరెస్టు చేశారు.. ఇక తర్వాత లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్ గ్యాంగ్ నుండి సల్మాన్ ఖాన్ కు హత్య బెదిరింపులు వచ్చాయట.. అయితే ఇప్పుడు ఏకంగా ఏ 47 గన్ తో ఆయనపై హత్యాయత్యానికి దిగడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసి బాలీవుడ్ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరి ఈ విషయంపై సల్మాన్ ఖాన్ ఏ విధంగా తనను తాను రక్షించుకుంటాడో అందరిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు