Hailey Bieber Diamond Ring Cost: తల్లి కానున్న భార్యకు జస్టిన్ బీబర్ డైమండ్ రింగ్ గిఫ్ట్… దాని ఖరీదు ఊహించడం ఖష్టమే

Hailey Bieber Diamond Ring Cost : హాలీవుడ్ స్టార్ కపుల్ జస్టిన్ బీబర్, హెయిలి బీబర్ జంట తమ మొదటి బిడ్డను త్వరలోనే ఆహ్వానించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే జస్టిన్ తన భార్య హెయిలీకి ఇచ్చిన డైమండ్ రింగ్ ఒకటి హాట్ టాపిక్ గా మారింది. తాజాగా హెయిలీ ఆ రింగ్ పెట్టుకుని కన్పించడంతో అందరి దృష్టిలో పడింది. దీంతో దాని కాస్ట్ ఎంత ఉంటుంది? అనే విషయంపై చర్చ మొదలైంది. మరి ఆ రింగ్ ఖరీదు ఎంత? అంటే.. 

గత నెలలో జస్టిన్ బీబర్, హెయిలి బీబర్ జంట హవాయిలోని ఒక ప్రైవేట్ వేడుకలో తమ మ్యారేజ్ యానివర్సరీని ఘనంగా జరుపుకున్నారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రెగ్నెన్సీ గురించిన సంతోషకరమైన వార్తను వెల్లడించారు. అప్పటి నుండి అమెరికన్ మోడల్, పాప్ సింగర్ జస్టిన్ నుండి బహుమతిగా పొందిన కొత్త డైమండ్ రింగ్‌ను పెట్టుకుని కన్పిస్తోంది హెయిలీ.

భర్త గిఫ్ట్ గా ఇచ్చిన కొత్త రింగ్

హెయిలీ తన భర్త గిఫ్ట్ గా ఇచ్చిన కొత్త రింగ్ ను రింగ్ ఫింగర్ కి పెట్టుకుంది. అప్పటికే ఆ వేలికి ఉండాల్సిన మ్యారేజ్ రింగ్ ని చిటికెన వేలికి మార్చింది. కొన్ని రోజుల క్రితం హెయిలీ తన కొత్త ఉంగరాన్ని పెట్టుకున్న కొత్త ఫోటోలను పోస్ట్ చేసింది. ఫోటోలో ఆమె తన బేబీ బంప్‌ని చూపిస్తున్న పలు సోలో షాట్‌లు ఉన్నాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆమె కొత్త డైమండ్ రింగ్. హెయిలీ తన కొత్త ఎంగేజ్‌మెంట్ ఉంగరాన్ని చూపిస్తూ కెమెరాలోకి చూస్తున్నప్పుడు ఒక కప్పు పట్టుకుని ఏదో సిప్ చేస్తున్నట్లు ఫోటోను క్యాప్చర్ చేశారు.

- Advertisement -

Hailey Bieber Delivery Date | Hailey Bieber Justin Bieber Pregnancy  Announcement Viral Post | Justin Bieber Hailey Bieber Expecting First  Child; She's Six Months Pregnant | When Will Justin Bieber Hailey Welcome

ఆ డైమండ్ రింగ్ కాస్ట్ ఎంతంటే?

లోరైన్ స్క్వార్ట్జ్ రూపొందించిన ఆమె ఉంగరంలో నాలుగు వైపులా ఓవల్-కట్ డైమండ్ ఉంటుంది. ఆమె ఎంగేజ్మెంట్ డైమండ్ రింగ్ మరొక చేతి చిటికెన వేలిపై కనిపిస్తుంది. ఆమె వివాహం 2019ల్ జరగ్గా, అప్పట్లో డైమండ్ టిఫనీ & కో వెడ్డింగ్ బ్యాండ్‌ని కూడా ధరించింది. ఈ ఫొటోల్లో ఆమె తన “B” నెక్లెస్‌కి సరిపోయేలా “B” రింగ్‌ని కూడా ధరించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు