Kajal Agarwal: పెళ్లికి ముందు ఆ డైరెక్టర్ తో ప్రేమాయణం నడిపిన కాజల్.. వివాహం ఎందుకు చేసుకోలేదు..?

Kajal Agarwal: టాలీవుడ్ చందమామగా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ మనందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన పేరును సంపాదించుకుని కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తుంది ఈ బ్యూటీ. ఇక ఇటీవలే దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్.. అనంతరం ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ సూపర్ హిట్ విజయం తన ఖాతాలో వేసుకుంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి మూవీలో బాలయ్య ప్రియురాలిగా ఈ బ్యూటీ నటించి మెప్పించింది. చిరంజీవి, రవితేజ, రామ్ చరణ్, రామ్ పోతినేని వంటి స్టార్ హీరోల సరసన నటించిన కాజల్ తాజాగా సత్యభామ మూవీతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా కాజల్ పై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Kajal who had romance with that director before marriage
Kajal who had romance with that director before marriage

ఈ బ్యూటీ పెళ్లికి ముందు ‌ ఓ డైరెక్టర్ ని ప్రేమించిందట. ఇక ఆ డైరెక్టర్ నే పెళ్లి చేసుకుందామని కలలు సైతం కన్నదట. కానీ.. ఆ డైరెక్టర్ కి అనుమానాలు ఎక్కువ అట. దీంతో తన అనుమానాలని తట్టుకోలేక ఓ రోజు పెద్ద గొడవే పెట్టుకుందట కాజల్‌. దీంతో వీరిద్దరికీ బ్రేకప్ అయ్యింది. ఇక ఆ కోపంలోనే తన మాజీ ప్రియుడు అయినా గౌతమ్ ని వివాహం చేసుకుంది. మరి ఆ డైరెక్టర్ ఎవరనేది తెలియకపోయినా ప్రెసెంట్ ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు