Sree Leela: నిర్మాతలకే ఆఫర్స్ ఇస్తున్న శ్రీ లీల ?

Sree Leela: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. మన ఇండస్ట్రీలో… తెలుగు హీరోయిన్ల కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లకు… డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఎక్స్పోజింగ్ బాగా చేస్తారు. దీంతో ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన హీరోయిన్లకు మన తెలుగు దర్శకనిర్మాతలు ఛాన్సులు ఇస్తున్నారు.

అలా వచ్చిన హీరోయిన్లలో శ్రీ లీల. యంగ్ హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది హీరోయిన్ శ్రీ లీల. వాస్తవానికి హీరోయిన్ శ్రీ లీలా ది ఆంధ్రప్రదేశ్ అని అంటారు. కానీ ఈ బ్యూటీ కర్ణాటకలో పుట్టి పెరిగింది. చదువు మొత్తం అమెరికాలో పూర్తి చేసింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తోంది హీరోయిన్ శ్రీ లీల.

పెళ్లి సందడి సినిమాతో… ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ శ్రీ లీల… ధమాకా సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. అయితే ధమాకా సినిమా… హిట్ అయిన తర్వాత వరుసగా ఈ బ్యూటీకి ఆఫర్లు వచ్చాయి.ఈ సినిమా తర్వాత… స్కంద, భగవంతు కేసరి, ఆది కేశవ, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ ఇలా ఎన్నో సినిమాలు చేసింది హీరోయిన్ శ్రీ లీల. కానీ ఒక్క సినిమా కూడా బంపర్ హిట్ అందుకోలేదు.

- Advertisement -
Sree Leela

అయితే మొన్న రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా అంతంత మాత్రమే ఆడింది. దీంతో హీరోయిన్ శ్రీ లీల కీలక నిర్ణయం తీసుకుందట. వరుసగా సినిమాలు ప్లాప్ అవుతున్న నేపథ్యంలో… అవకాశాలు ఎక్కువగా రావడం లేదట. దీంతో రెమ్యూనరేషన్ తక్కువ ఇచ్చిన సరే… సినిమాలు చేసేందుకు… సిద్ధమైందట. నిర్మాతలు ఎవరు వచ్చినా… తక్కువ రెమ్యూనరేషన్ ఇచ్చిన సినిమాలు చేస్తానని చెబుతోందట ఈ బ్యూటీ.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు