Tyson Naidu: ప్రామెసింగ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా రూపొందుతున్న యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” టైసన్ నాయుడు “. భీమ్లానాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర దర్శకత్వం లో ఈ మూవీ రూపొందుతుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇక ప్రజెంట్ ఈ చిత్రం చిత్రీకరణ దిశలో ఉంది. ఇక ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కి జోడిగా నభ నతేష్ నటిస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రాజస్థాన్ లో జరుగుతుంది. రాజస్థాన్లో 100 మంది ఫైటర్లు, 300 మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు మూవీ యూనిట్.
ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ భారీ సెటప్ చూస్తుంటే మూవీ వేరే లెవెల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో ఈ మధ్యకాలంలో సరైన హిట్ అయితే పడలేదు. మరి ఈ మూవీ తో అయినా మంచి సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి..!