Ileana: దేవదాసు చిత్రంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. అనంతరం వచ్చిన మహేష్.. పోకిరి చిత్రంతో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
అయితే 2018 లో వచ్చిన.. అమర్ అక్బర్ ఆంటోనీ.. చిత్రం తరువాత మరో సినిమా చేయలేదు. అంతేకాదు పెళ్లి కాకుండా పిల్లాడిని కని షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీనికోసం గ్లామర్ డోస్ పెంచి నెట్టింట అందాల జాతర షురూ చేసింది ఈ బ్యూటీ.
మత్తెక్కించే డ్రెస్సులు ధరించి కిరాక్ ఫోటోలు దిగుతుంది. అంతేకాకుండా మూవీ ఆఫర్స్ కోసం డైరెక్టర్ల కాళ్ళను సైతం పట్టుకుంటుందట ఇలియానా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. మరోసారి నా టాలెంట్ నిరూపించుకుంటాను..అంటూ బ్రతిమాలుకుంటుందట. మరి ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ప్రెసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.