OTT Movie : కొత్త ఇంట్లోకి ఆ ఫ్యామిలీ అడుగు పెట్టిన వెంటనే అమ్మాయి మృతి… మెంటలెక్కించే హార్రర్ మూవీ

OTT Movie : హర్రర్ కే టెర్రర్ పుట్టించే సినిమాలు కొన్ని ఉంటాయి. సాధారణంగా హారర్ మూవీ లవర్స్ కి ఇతర జానర్లో ఎన్ని సినిమాలు చూసినా హారర్ సినిమాలు చూసినంత కిక్ అయితే రాదని చెప్పాలి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోపోయే మూవీని చూస్తే మాత్రం మెంటల్ ఎక్కించే హర్రర్ మూవీ అనక మానరు. మరి ఇప్పటిదాకా ఈ సినిమాను చూడకపోతే కచ్చితంగా ఓ లుక్ వెయ్యండి. సినిమా చూశాక ఇది మీ వాచ్ లిస్ట్ లో ఫేవరెట్ గా మారడం ఖాయం. ఇంతకీ ఈ హారర్ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళితే…

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న హారర్ మూవీ పేరు డెత్ విస్పరర్. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. హర్రర్ మూవీ లవర్స్ కి వర్త్ వాచింగ్ మూవీ అనిపించే సినిమా ఇది. కాబట్టి డోంట్ మిస్. కొత్త ఊర్లో ఓ ఫ్యామిలీ వింత సంఘనలు ఎదుర్కోవడం గురించే ఉంటుంది ఈ మూవీ స్టోరీ. ఇలాంటివి ఇప్పటిదాకా ఎన్నో వచ్చాయి. కానీ ఈ మూవీ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది.

Death Whisperer Review – Lush Settings, Sparse Scares – Abstract AF!

- Advertisement -

మూవీ స్టోరీ ఏంటంటే…

1992లో ఈ మూవీ స్టోరీ నడుస్తుంది. సినిమాలో ఒక థాయ్ చైనీస్ ఫ్యామిలీనీ చూపిస్తారు. అందులో నలుగురు అబ్బాయిలు ఉంటే మరో నలుగురు అమ్మాయిలు ఉంటారు. ఇక పెద్ద కొడుకు మిలటరీలో పని చేస్తాడు. కాబట్టి ఎప్పుడూ ఇంట్లో ఉండడు. మిగతా ఫ్యామిలీ అంతా కొత్త ప్రాంతానికి వెళ్లడంతో పాటు ఆ ఇల్లు వాళ్ళకి బాగా నచ్చేస్తుంది. కానీ ఆ కొత్త ఫ్యామిలీ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన కొన్ని రోజుల్లోనే ఊరిలో కొన్ని అనుమానాస్పద పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఊహించని విధంగా ఓ అమ్మాయి చనిపోతుంది. అక్కడే ట్విస్ట్ మొదలవుతుంది ఆ చనిపోయిన అమ్మాయికి ఏం జరిగిందో అచ్చం థాయ్ చైనీస్ ఫ్యామిలీలో కూడా అలాంటి పరిస్థితులే ఎదురవడం స్టార్ట్ అవుతుంది.

ముందుగా ఆ ఫ్యామిలీలోని రెండవ కూతురు తనకు ఏదో ఒక నల్లని ఆకారం కనిపిస్తోందని చెప్తూ వింత వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ అమ్మాయితో పాటు మిగతా వాళ్ళకి కూడా ఒక్కొక్కరిగా ఆ నల్లని ఆకారం కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రెండవ కూతురు గొంతు మార్చి మాట్లాడుతూ వింత వింతగా ప్రవర్తిస్తూ ఉండడంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇక ఈ విషయాలన్నీ తెలుసుకున్న పెద్ద కొడుకు మిలిటరీ నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత అతను తన కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు ? ఆ నల్లని ఆకారం ఎవరిదసలు? ఎందుకు ఆ ఆకారం ఈ ఫ్యామిలీకి మాత్రమే కనిపిస్తోంది ? ఆ ఆకారం స్టోరీ ఏంటి ? అనే విషయాలు తెలియాలంటే డెత్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీని చూసి తీరాల్సిందే. మీరు ఇప్పటిదాకా ఈ సినిమాను చూసి ఉండకపోతే మిస్ అవ్వకుండా చూడండి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు