Lawrence: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అండ్ హీరో రాఘవ లారెన్స్ ప్రస్తుతం ఫుల్ బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినిమా షూటింగ్లకు హాజరవుతూనే మరో పక్క విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు బయట వాళ్లకు ఎక్కువ సర్ప్రైజులు ఇస్తూ వచ్చిన లారెన్స్ ఇప్పుడు తన తమ్ముడు ఎల్విన్ కు అదిరిపోయే బహుమతి ఇచ్చాడు.
లారెన్స్ బాటలోనే నడుస్తున్న అతను కూడా త్వరలోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఎల్విన్ నటించిన.. బుల్లెట్.. మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక తాజాగా ఈ సినిమా వీక్షించాడు లారెన్స్. తమ్ముడు నటన బాగా నచ్చడంతో ఎమ్ జీ హెక్టార్ కారును బహుమతిగా ఇచ్చాడు.
Hi friends and fans,
I would like to share this special moment with you all. I saw my Brother @elviinvinu_off debut movie #Bullet and I’m so happy with his performance. This is my Gift for him and A special kiss for making me proud with his acting. My wishes to the entire team.… pic.twitter.com/6BX31ExBs0— Raghava Lawrence (@offl_Lawrence) May 31, 2024
ఇక ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ” నేను నా తమ్ముడు నటించిన తొలి మూవీ బుల్లెట్ చూశాను. ఇందులో అతడి నటన అద్భుతం. అందుకే అతడికి ఇది నా గిఫ్ట్ గా ఇస్తున్నాను. నేను ఇది గర్వంగా భావిస్తున్నాను. యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు ” అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు లారెన్స్. ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.