Sillunu Oru Kaadhal: సినిమాకు సీక్వెల్స్ సిద్ధం కానుంది

Sillunu Oru Kaadhal: ప్రస్తుతం ఉన్న తమిళ్ యంగ్ హీరోస్లో కెవిన్ ఒకరు. మొదట టెలివిజన్లో తన కెరియర్ను స్టార్ట్ చేసి ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ 3 లో ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్గా బాక్స్ ఆఫీస్ వద్ద కెవిన్ చేసిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచాయి. లిఫ్ట్ మరియు దాదా సినిమాలు కెవిన్ కి మంచి పేరును తీసుకొచ్చాయి. తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు లాగానే బాగా కష్టపడి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. శివ అరవింద్ దర్శకత్వం వహించిన “నటపున ఎన్నన్ తెరియుమా”అనే సినిమాతో డెబ్యు హీరోగా కెరియర్ని స్టార్ట్ చేశాడు.

వినీత్ వరప్రసాద్ దర్శకత్వంలో 2021 లో వచ్చిన లిఫ్ట్ అనే సినిమాలో కెవిన్ లీడ్ రోల్లో కనిపించాడు. ఈ సినిమా నేరుగా హాట్స్టార్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమాతోనే వినీత్ వరప్రసాద్ డెబ్యూ డైరెక్షన్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన రొమాంటిక్ కామెడీ ఫిలిం దాదా. ఈ సినిమాను గణేష్ కే బాబు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక రీసెంట్ గా స్టార్ అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద తన టాలెంట్ ను మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు కెవిన్.

Sillunu Oru Kaadhal

సీక్వెల్ ప్లానింగ్

ఇక ప్రస్తుతం కెవిన్ లైన్లో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే సూర్య జ్యోతిక భూమిక కలిసిన నటించిన సినిమా నువ్వు నేను ప్రేమ. ఇదే సినిమాకి సీక్వెల్ గా కెవిన్ ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నువ్వు నేను ప్రేమ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య శివకుమార్, జోతిక, భూమిక తో పాటు వడివేలు, శ్రియ శర్మ, సంతానం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఎన్ కృష్ణ నిర్వహించారు మరియు నిర్మాత కె ఈ జ్ణానవేల్ రాజ నిర్మించారు. ఈ చిత్రానికి ఎ ఆర్ రెహ్మాన్ సంగీతం అందించారు. ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఒక ఫ్రెష్ ఫీల్ ను క్రియేట్ చేస్తాయి. ఈ చిత్రం సూర్య మరియు జ్యోతిక వివాహానికి మూడు రోజుల ముందు 8 సెప్టెంబర్ 2006న విడుదలైంది. ఈ చిత్రానికి మొదట జిల్లును ఒరు కాదల్ అని పేరు పెట్టారు, మరియు అది స్వచ్ఛమైన-తమిళ పేరును కలిగి ఉండటానికి సిల్లును ఒరు కాదల్‌గా మార్చబడింది. 2015లో, ఈ చిత్రం మరాఠీలోకి తూ హి రేగా రీమేక్ చేయబడింది, ఇందులో స్వప్నిల్ జోషి, సాయి తంహంకర్, తేజస్విని పండిట్ నటించారు మరియు సంజయ్ జాదవ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సీక్వెల్ గా కెవిన్ తో సినిమా చేయబోతున్నట్లు దర్శకుడు కృష్ణ అనౌన్స్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు