Thug Life : థగ్ లైఫ్ లో PS ఫార్ములా ఫాలో అవుతున్న మణిరత్నం?

Thug Life : కోలీవుడ్ లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా “థగ్ లైఫ్” సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. మూడు దశాబ్దాల తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నిజానికి కెరీర్ మొదట్లోనే మణిరత్నం టాలెంట్ ని గుర్తించి అవకాశం ఇచ్చాడు కమల్ హాసన్. ఇక ఈ ఇద్దరు కలిసి చేసిన సినిమా నాయకన్ సినిమా ఎంత సంచలన విజయం అందుకుందో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే కోలీవుడ్ తో పాటు సౌత్ మొత్తం భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక విక్రమ్ సినిమా తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టి తిరిగి కెరీర్ లో ఫుల్ జోష్ అందుకున్న కమల్ హాసన్ క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసుకున్నాడు. ఆల్రెడీ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక ఇప్పుడు మణిరత్నం తో చేస్తున్న థగ్ లైఫ్ సినిమా కూడా భారీ అంచనాలతో తెరకెక్కుతుంది. ఇక థగ్ లైఫ్ సినిమా భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో వస్తుంది.

Mani Ratnam is making the movie Thug Life in two parts

PS ఫార్ములా ఫాలో అవుతున్న మణిరత్నం?

అయితే థగ్ లైఫ్ (Thug Life) సినిమాకు మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ ఫార్ములా ఫాలో అవుతున్నాడని సమాచారం. అదేంటంటే థగ్ లైఫ్ సినిమాను ముందు ఒక భాగంగానే చేయాలని అనుకున్నా, ఇప్పుడు ఆ ఆలోచన మార్చుకున్నారని టాక్ నడుస్తుంది. మణిరత్నం కమల్ హాసన్ థగ్ లైఫ్ కూడా బాహుబలి, పొన్నియిన్ సెల్వన్ తరహాలో రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట. సినిమా లెంగ్త్ ఎక్కువందని ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. అఫీషియల్ గా త్వరలోనే ఈ విషయాన్ని చెప్పబోతారంటూ కోలీవుడ్ వర్గాల టాక్. ఇక ఆ మధ్య థగ్ లైఫ్ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ తోనే సినిమాపై సూపర్ బజ్ పెంచేశాడు మణిరత్నం. పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాల తర్వాత ప్రెస్టీజియస్ గా చేస్తున్న సినిమా థగ్ లైఫ్. ఈ సినిమాలో కమల్ తో పాటు శింబు, జయం రవి, త్రిష ఇంకా చాలామంది ఇతర క్రేజీ ఆర్టిస్టులు నటిస్తున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ఈ సినిమా కథ అనుకున్న దానికన్నా గొప్పగా వస్తుండటం వల్ల సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట.

- Advertisement -

రెండింటికి గ్యాప్?

ఇక మణిరత్నం పి.ఎస్ 1 అండ్ 2 రెండు భాగాలను ఒకేసారి షూట్ చేసి రెండిటి మధ్య ఆరు నెలలు గ్యాప్ ఇచ్చి రిలీజ్ చేశారు. కానీ కమల్ థగ్ లైఫ్ మాత్రం అలా కాకుండా ఫస్ట్ పార్ట్ అనుకున్నంత వరకే పూర్తి చేసి రిలీజ్ చేసి, ఆ తర్వాత సెకండ్ పార్ట్ షూటింగ్ చేస్తారని తెలుస్తుంది. దీంతో ఈ సినిమాలకు దాదాపు ఏడాది పాటు గ్యాప్ రావొచ్చని అంటున్నారు నెటిజన్లు. ఇక కమల్ తో మణిరత్నం చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు ప్రేక్షకుల మెప్పు పొందుతుంది అన్నది చూడాలి. ఈ సినిమాతో పాటుగా మణిరత్నం కోలీవుడ్ స్టార్స్ తో మెగా మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఇక కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్2 ప్రమోషన్లలో బిజీగా ఉండగా జూన్ 27న ఆ సినిమా రిలీజ్ కాబోతుంది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు