Bollywood : దేశంలో గత రెండు నెలలుగా ఎన్నికల హడావిడి పీక్స్ లో గడిచిందన్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ దాకా పలు రాష్ట్రల్లో భారీగా ఎన్నికల ప్రచారం జరిగింది. ఇక తెలుగు రాష్ట్రాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఫలితాలు జూన్ 4 తో ఫైనల్ గా తేలిపోనున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో పలువురు సినీ ప్రముఖులు కూడా ఎన్నికల్లో నిలబడ్డ సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి సినీ ప్రముఖుల విజయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఇక నార్త్ వైపు కూడా ఎందరో స్టార్ సినీ సెలెబ్రిటీలు పోటీ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల పలితాలు ముందు ఎగ్జిట్ పోల్స్ ద్వారా పార్టీల ఫలితాలను, ఆయా నేతల నియోజకవర్గాల ఫలితాలను ఒక అంచనాతో తెలియచేస్తారు. అయితే తాజాగా ఓ బాలీవుడ్ (Bollywood) ఫేమస్ నటికి సంబంధించిన వివరాలు ఎగ్జిట్ పోల్స్ ద్వారా పాజిటివ్ గా వస్తున్నాయట.
బాలీవుడ్ క్వీన్ కి ఎగ్జిట్ పోల్స్ లో పాజిటివ్ రిజల్ట్స్..
ఇక బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ రీసెంట్ గా ఎన్నికల్లో మండి నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే గా పోటీ చేసిందన్న సంగతి తెలిసిందే. తాజాగా లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్ మండి నియోజకవర్గం నుండి లైవ్ ఆసక్తికర వివరాలను వెల్లడించింది. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కి ఈ నియోజకవర్గంలో ఎదురే లేదనేది తాజా ఎగ్జిట్ పోల్ రిపోర్ట్. కాంగ్రెస్ నాయకుడు విక్రమాదిత్య సింగ్‌ను ఓడించబోతోందని ‘ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా’ అంచనా వేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో తాజాగా ఓటింగ్ జరిగింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థి, మేటి కథానాయిక కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ పార్టీ విక్రమాదిత్య సింగ్‌ను రంగంలోకి దించింది. కంగనా రనౌత్ తన సొంత ఊరు ‘మండి’ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా రాజకీయ అరంగేట్రం చేస్తోంది. విక్రమాదిత్య సింగ్ ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్, హిమాచల్ ప్రదేశ్ యూనిట్ చీఫ్ ప్రతిభా సింగ్ ల కుమారుడు.
గెలిస్తే రికార్డ్..
ఇక ఈ సారి ఎన్నికల్లో కంగనా రనౌత్ దే విజయం అని తేల్చేస్తున్నారు బాలీవుడ్ మీడియా. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ 2024 ప్రకారం, కంగనా రనౌత్ తన తొలి ఎన్నికల్లో మండి లోక్‌సభ నియోజకవర్గం నుండి గెలుపొందే అవకాశం ఉందట. సొంత నియోజక వర్గంలో పోటీ కంగనకు అన్నివిధాలా కలిసి రానుందని అంచనా. ప్రచారంలో కొన్ని ఎదురుదెబ్బలు తగిలినా అవి, తనకు అనుకూలంగా మార్చుకున్న కంగనా భారీగా ఎన్నికల ప్రచారంలో మెరిసింది. ఇక కంగనా గెలిస్తే బాలీవుడ్ లో ఓ రికార్డు సృష్టించినట్టే అంటున్నారు బాలీవుడ్ వర్గాలు. కొన్ని రోజులు కంగనా యే హాట్ టాపిక్ గా మారుతుందనడంలో సందేహం లేదు. మరి జూన్ 4న ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.