Siddharth – Aditi: పెళ్లికి ముందే హనీమూన్.. భారీగా ప్లాన్ చేస్తున్న హీరో..!

Siddharth – Aditi : తెలుగు బ్యూటీ అదితి రావు హైదరి, కోలీవుడ్ హీరో సిద్దార్థ్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.. వీరిద్దరూ చట్ట పట్టాలేసుకొని తిరుగుతూ ఎన్నోసార్లు మీడియా కంట పడ్డారు. అంతేకాదు ఒకసారి ఏకంగా హోటల్ నుంచి బయటకు వస్తూ కెమెరాకి చిక్కారు. ఆ సమయంలో సిద్దార్థ్ ఏకంగా కెమెరా మెన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. తమ మధ్య అటువంటి బంధం ఏమీ లేదు అంటూ బుకాయించారు.. కానీ ఎట్టకేలకు ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకొని అందరి అంచనాలను నిజం చేశారు . ఇటీవల హైదరాబాదులో సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకొని ఆ తర్వాత అధికారికంగా ప్రకటించారు. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకుంటామని ప్రకటించింది. ఇద్దరూ తమ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా ఫోటోలు, వీడియోలు కూడా షేర్ చేశారు. ఇక నిశ్చితార్థం తర్వాత రెగ్యులర్ గా కలసి కనిపిస్తూ తాము పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ అందరికీ స్పష్టం చేస్తున్నారు.

పెళ్లికి ముందే హనీమూన్ కి..

Siddharth - Aditi: Honeymoon before marriage.. The hero is planning heavily..!
Siddharth – Aditi: Honeymoon before marriage.. The hero is planning heavily..!

ఇదిలా ఉండగా తాజాగా ఈ జంట పెళ్లికి ముందే హనీమూన్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.. ఈ జంట ఇటలీ దేశంలోని టస్కనీ ప్రాంతానికి వెకేషన్ కి వెళ్లారు.. అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ చాలా క్లోజ్ గా దిగిన ఫోటోలను ఇద్దరు తమ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు షేర్ చేస్తూ టస్కనీ లో ఎంజాయ్ చేస్తున్నట్టు కూడా తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఎంగేజ్మెంట్ చేసుకొని హనీమూన్ కి ఇటలీకి వెళ్లారు.. హనీమూన్ నుంచి తిరిగి రాగానే డిసెంబర్లో వీరి వివాహం జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అదితి రావు బ్యాక్ గ్రౌండ్..

హైదరాబాదుకు చెందిన జానంపల్లి రామేశ్వరరావు కుటుంబంలో జన్మించిన ఈమె రాజ కుటుంబానికి చెందినది.. 2006లో మమ్ముట్టి తరపున మలయాళ చిత్రం ప్రజాపతి సినిమాతో అరంగేట్రం చేసింది.. ఈ సినిమాలో దేవదాసి పాత్రలో నటించిన అదితికి ప్రేక్షకుల, విమర్శకుల నుంచీ ప్రశంసలు కూడా లభించాయి. 2011లో సుధీర్ దర్శకత్వంలో యే సాలీ జిందగీ అనే సినిమా ద్వారా మరింత పేరు దక్కించుకుంది… ఈమె నటనకి ఉత్తమ సహాయ నటి పురస్కారం కూడా లభించింది.. ఇక ఈమె ఎవరో కాదు సినీ నిర్మాత ప్రముఖ హీరో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు కి కజిన్ అవుతుంది. వనపర్తి సంస్థానాధీశుడు రాజా జె .రామేశ్వర రావు , శాంతా రామేశ్వర రావు లు అదితికి అమ్మమ్మ, తాతయ్యలు అవుతారు. ఇక ఈమె ఆరవ యేటనే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది. అలా ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి లో ఉన్న రిషి వ్యాలీ స్కూల్ ప్రాథమిక విద్య అభ్యసించిన ఈమె ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన లేడీ శ్రీరామ్ కళాశాలలో డిగ్రీ పట్టా అందుకుంది.

- Advertisement -

పెళ్లి, విడాకులు, రహస్య నిశ్చితార్థం..

2002లో సత్యదీప్ మిశ్రా ను పెళ్లి చేసుకొని 2012 లో విడాకులు ఇచ్చింది. ఇక ఇప్పుడు 2024 మార్చి 27న వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్ లోని రంగనాథ స్వామి ఆలయంలో నటుడు సిద్ధార్థ తో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari)

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు