Chandini Chowdary: ఒకేరోజు రెండు మూవీలు.. భలే సెట్ చేసిందే..?

Chandini Chowdary.. ప్రముఖ తెలుగు బ్యూటీ.. కలర్ ఫోటో సినిమా హీరోయిన్ చాందిని చౌదరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ తెలుగు అమ్మడు హీరోయిన్ గా ఎదిగి వరుస సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ మధ్యకాలంలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా తనదైన శైలిలో నటిస్తూ.. భారీ క్రేజ్ అందుకుంటున్న చాందిని ఇటీవల హీరో విశ్వక్ సేన్ నటించిన గామి సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక త్వరలోనే మ్యూజిక్ షాప్ మూర్తి , యేవమ్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలలో ఈమె లీడ్ రోల్స్ నటించింది.. పైగా రెండు సినిమాలు ఒకేరోజు విడుదల అవ్వడంతో అందరి దృష్టి ఈమె వైపే..

ఓకే రోజు రెండు సినిమాలు..

Chandini Chowdary: Two movies on the same day.. Are they set?
Chandini Chowdary: Two movies on the same day.. Are they set?

సాధారణంగా స్టార్ హీరోలు, హీరోయిన్లు నటించిన చిత్రాలు కూడా దాదాపు ఒకేరోజు విడుదల కావు… అందులోనూ ఈమె ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చి స్థిరపడే ప్రయత్నం చేస్తోంది. పైగా లీడ్ రోల్ పోషిస్తోంది కూడా.. అందులోనూ ఒకేరోజు రెండు సినిమాలు విడుదలవ్వడం అంటే ఇది పెద్ద ఆశ్చర్యమైన విషయం అనేది చెప్పాలి.. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు, నెటిజన్లు చాందిని చౌదరి కావాలనే ఈ రెండు సినిమాలను ఒకేరోజు విడుదల చేసేలా ప్లాన్ చేశావా? లేక అలా కలిసొచ్చిందా అంటూ కామెంట్లో చేస్తున్నారు.ఇక మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ఇదివరకే ఎన్నోసార్లు వాయిదా పడి చివరికి జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.. అయితే తాజాగా యేవమ్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నట్లు ఆ సినిమా బృందం తెలియజేసింది.. ఈ రెండు సినిమాలు కూడా కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలే..

యేవమ్..

యేవమ్ సినిమా విషయానికొస్తే.. ఇందులో చాందిని ఒక పవర్ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది.. ఇదివరకే ఈ సినిమా నుంచి టీజర్ కూడా రిలీజ్ అవ్వగా.. టీజర్ ఆధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రాబోతోంది.. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్ ని ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని నవదీప్ సీ స్పేస్ మరియు ప్రకాష్ దంతులూరి ప్రొడక్షన్స్ బ్యానర్లపై సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఇక ఈ సినిమాలో ప్రముఖ యూట్యూబర్ అషు రెడ్డి అలాగే భరత్ రాజ్ కీలకపాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.

- Advertisement -

మ్యూజిక్ షాప్ మూర్తి:

ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి.. శివ పాలగడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి చాలా గ్రాండ్ గా సినిమాని నిర్మిస్తున్నారు.. కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ తో వస్తున్న ఈ సినిమాలో చాందిని చౌదరి లీడ్రోల్ పోషిస్తోంది.

నిజమైతే ఆ గౌరవం చాందినీకే.

ఇలా రెండూ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లలో తెరకెక్కుతున్నాయి.. ఇలా రెండు సినిమాలను కూడా ఒకే రోజు విడుదల చేయడానికి చాందిని చౌదరి ముందుకు వచ్చింది.. ఇప్పటివరకు ఒకే నిర్మాణ సంస్థ నుంచి 2 వేరువేరు సినిమాలు ఒకేరోజు లేదా మరుసటి రోజు వచ్చాయేమో.. కానీ ఒకే హీరోయిన్ ఉన్న సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవ్వడం మాత్రం ఇదే మొదటిసారి..అయితే ఇలా రిలీజ్ కావడానికి చాందిని ఒప్పుకుందా లేక సినిమా నిర్మాతలు ఒప్పించారా అనే విషయం మాత్రం తెలియదు.. మొత్తానికైతే రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయితే మాత్రం చాందిని రెండు సినిమాల ప్రమోషన్స్ కి చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరి చాందిని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూడాలి. ఒకవేళ రెండు సినిమాలు గనుక ఒకేరోజు విడుదలై మంచి విజయం సాధిస్తే ఇలాంటి అరుదైన గౌరవం చాందినీకి లభిస్తుందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు