HBD Manirathnam : దర్శకులలో రత్నం ఈ “మణిరత్నం”..

HBD Manirathnam : దేశంలో ఉన్న గర్వించదగిన లెజెండరీ దర్శకుల్లో “మణిరత్నం” ఒకరు. ఈయన సినిమా వస్తుందంటే ఒక్క తమిళ్ లోనే కాదు ఇండియా అంతటా ఆసక్తిగా ఎదురుచూస్తారు. పెద్ద పెద్ద దర్శకులకు కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఈ మధ్య మణిరత్నం సినిమాలకు ఆదరణ తక్కువయినా, మణిరత్నం సినిమా అంటే ఎప్పుడూ ఒక ఫ్రెష్ ఫీలింగ్. ఓ మామూలు కథలోనే ప్రేక్షకులకు ఏదో తెలీని సరికొత్త ఫీలింగ్ ని తీసుకొస్తాడు. చిన్న చిన్న కథలతోనే ఆలోచింపచేసే చిత్రాలు తీశారాయన. నవతరం ప్రేక్షకులకు మణిరత్నం చిత్రాల్లోని గొప్పతనం పెద్దగా అర్థం కాకపోవచ్చు. కానీ ఒక దర్శకుడు కావాలనుకునే ప్రతివాడు ఆయన సినిమా టేకింగ్ ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. మామూలుగా మణిరత్నం సినిమాల్లో చాలామంది చూసేది హీరోయిన్ న్యాచురాలిటీ అందం, కామన్ మ్యాన్ గా ఉండే హీరో పెర్ఫార్మన్స్, అద్భుతమైన పాటలు.. కానీ వీటన్నిటిని మించిన రియాలిటీ సీన్స్ మణిరత్నం దర్శకత్వంలో ఉంటుంది. అంతే కాదు చాలా సినిమాల్లో ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వివరాలు మణిరత్నం సినిమాల్లో ఉంటాయి. ఈ రోజు లెజెండరీ దర్శకుడు “మణిరత్నం” (HBD Manirathnam) పుట్టినరోజు(జూన్ 2) ఈ సందర్బంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలియచేస్తూ మణిరత్నం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

HBD Manirathnam Birth day Special

దర్శకులలో రత్నం మణిరత్నం..

మణిరత్నం సినిమాల్లో బెస్ట్ సినిమాలంటే చెప్పొచ్చు గాని, ఏ సినిమా ముందుందంటే చెప్పడం కష్టం. ఎందుకంటే ఒక్కో సినిమా ఒక్కో కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. అయితే మొదట సౌత్ మొత్తం మణిరత్నం పేరు మార్మోగిపోయేలా చేసిన సినిమా మాత్రం “నాయగన్”. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పోలా రూపొందించిన ‘గాడ్ ఫాదర్’ స్ఫూర్తితో మణిరత్నం తెరకెక్కించిన ‘నాయకన్’ చిత్రం అల్ టైం క్లాసిక్ హిట్ సినిమాగా నిలిచింది. మణిరత్నం కమల్ హాసన్ కలయికలో వచ్చిన ఆ చిత్రం ఎన్నో రికార్డులు సృష్టించింది. ‘టైమ్ మేగజైన్’ ఎంపిక చేసిన టాప్ 100 మూవీస్ లో చోటు చేసుకుంది ఈ సినిమా. దీనిని బట్టే మణిరత్నం ప్రతిభా పాటవాలేపాటివో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’ పేరుతో విడుదలై ఇక్కడా సూపర్ హిట్ అయింది. అలాగే మణి రూపొందించిన ‘రోజా, బొంబాయి, దిల్ సే’ చిత్రాలు ‘టెర్రరిజమ్’ నేపథ్యంలో చితికిపోయిన కుటుంబాలనుండి ప్రశ్నిస్తూ సినిమాలు తీసాడు. ఇక యువ లాంటి చిత్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజకీయాలు యువత చేతిలో ఉంటె ఎలా ఉంటుందన్న కథాంశంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ‘మౌనరాగం’, ‘గీతాంజలి’, సఖి, వంటి చిత్రాలతో ప్రేమికులను మైమరపింపచేసారు.

- Advertisement -

మణిరత్నం సినిమాలతో వీళ్ళకి స్టార్ డమ్..

మణి చిత్రాల ద్వారా ఎందరో తారలు స్టార్స్ అయ్యారు. కెరీర్ బిగినింగ్ లో తీసిన సినిమాల నుండి చూసుకున్నా, ‘మౌనరాగం’తో కార్తిక్, రేవతి స్టార్ డమ్ చూశారు. నాయగన్ తో కమల్ హాసన్, ‘దళపతి’ తో రజినీకాంత్, అలాగే ‘రోజా’తో అరవింద్ స్వామి పాపులర్ స్టార్ అయిపోయాడు. ఇదే ‘రోజా’తో సంగీత దర్శకునిగా పరిచయమైన ఎ.ఆర్.రహమాన్ ఆ తరువాత మణి చిత్రాలతోనే స్టార్ అయ్యాడు. ఇక మణి ‘ఇరువర్’తోనే ఐశ్వర్యారాయ్ తెరంగేట్రం చేసి స్టార్ హీరోయిన్ అయింది. మణి రత్నం సినిమాలతోనే పి.సి.శ్రీరామ్, సంతోష్ శివన్, రాజీవ్ మీనన్, రవి కె.చంద్రన్ వంటి సినిమాటోగ్రాఫర్స్ కు ఎనలేని పేరు లభించింది. ఇలా చెప్పుకుంటూ పోతే మణి చిత్రాల ద్వారా చిత్రసీమలో వెలుగు చూసిన వారి జాబితా పెరుగుతూ పోతుంది. ఇక రెండేళ్ల కింద చారిత్రక నేపథ్యంలో మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ రెండు భాగాలూ అఖండ విజయం సాధించగా, త్వరలో కమల్ హాసన్ తో “థగ్ లైఫ్” సినిమాతో పలకరించబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు