Raghuvaran: విలన్ రఘువరన్ కొడుకుని చేశారా.. ఆ రంగం వైపే ఆసక్తి..?

Raghuvaran: రఘువరన్.. ఈయన పేరు వినగానే వెంటనే గుర్తొచ్చే సినిమాలు మహేష్ బాబు నటించిన నాని , పవన్ కళ్యాణ్ నటించిన సుస్వాగతం.. ఈ రెండు సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని తెలుగు ఆడియన్స్ కు మరింత దగ్గరయ్యారు రఘువరన్.. దాదాపు 200కు పైగా సినిమాలలో నటించి అసాధారణమైన నటనతో మెప్పించిన ఈయన .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి మెప్పించారు. నటుడిగా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన రఘువరన్ విలన్ గా కూడా అంతే పాపులారిటీ సంపాదించుకొని.. 50 సంవత్సరాల వయసులో పలు అనారోగ్య సమస్యలతో 2008లో స్వర్గస్తులయ్యారు..

స్టార్స్ తో పోటీగా ప్రేక్షకాదరణ..

Raghuvaran: Did you make the son of Villain Raghuvaran.. Interested in that field..?
Raghuvaran: Did you make the son of Villain Raghuvaran.. Interested in that field..?

1980- 1990 మధ్యకాలంలో సౌత్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ విలన్ గా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు.. ముఖ్యంగా సినిమాలలో చాలా పాత్రలలో నెగిటివ్ పాత్రలు పోషించినప్పటికీ రజనీకాంత్, కమలహాసన్, చిరంజీవి వంటి హీరోలకు సమానంగా అభిమానులను సంపాదించుకున్నారు. అలాగే పలు సినిమాలలో అన్నగా, తండ్రిగా కూడా క్యారెక్టర్స్ రోల్స్ చేసి మెప్పించాడు.. సినిమాలలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన రఘువరన్ నిజజీవితంలో కూడా అంతకంటే ఎక్కువ ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు..

వివాహం, విడాకులు..

1996లో తోటి నటి రోహిణి నీ వివాహం చేసుకోగా.. 1998లో రిషి వరణ్ అనే కుమారుడు జన్మించారు. వైవాహిక జీవితంలో దాదాపు 8 సంవత్సరాల పాటు సంతోషంగా గడిపిన ఈ జంట 2004లో విడాకులు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.. తర్వాత రిషివరణ్ తల్లి వద్దే పెరిగాడు.

- Advertisement -

అచ్చం తండ్రిలాగే..

ప్రస్తుతం ఈయన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి .. రిషి వరణ్ హైట్,, స్టైల్ అన్నీ కూడా తండ్రిలాగే.. అచ్చం తండ్రిలాగే కనిపిస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మ్యూజిక్ రంగం వైపు ఆసక్తి..

అయితే రిషి వరన్ తల్లిదండ్రుల్లాగా నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకుండా.. సంగీతం వైపు వెళ్లినట్లు తెలుస్తోంది.. ఇప్పటికే ఇంగ్లీష్ ఆల్బమ్స్ రిలీజ్ చేశాడు కూడా ఫాదర్ సన్ బారిన్ అనే ఆల్బమ్ మంచి విజయాన్ని అందుకుంది.. వాస్తవానికి మొదట్లో రఘువరన్ కూడా సంగీతం వైపే ఆకర్షితుడయ్యాడు.. ఆ తర్వాత సౌత్ ఇండస్ట్రీ అద్భుతమైన నటులలో ఒకరిగా పేరు దక్కించుకున్నారు.. ఇప్పుడు రఘువరన్ తనయుడు కూడా మ్యూజిక్ రంగం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.. మొత్తానికైతే రఘువరన్ కొడుకుని చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమా రంగం వైపు కాకుండా మ్యూజిక్ రంగం వైపు అడుగులు వేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు రిషి వరన్.

గుండెపోటుతో మరణం..

ఇకపోతే భార్య నుంచి విడిపోయిన తర్వాత ఆమెపై ఇష్టాన్ని చంపుకోలేక మద్యపానానికి బానిసైన రఘువరన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో 2008లో గుండెపోటుతో మరణించారు.

మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమాలు..

ఇకపోతే సుస్వాగతం , ఆహా, శివ, నాని, జానీ, మాస్ వంటి చిత్రాలు రఘువరన్ కు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇక మరొకవైపు ఈయన భార్య రోహిణి ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికీ పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు